»   » విజయం తలకెక్కిందా? 80 కోట్లు ఏంది సామీ.... ప్రభాస్‌ మీద బాలీవుడ్లో సెటైర్లు!

విజయం తలకెక్కిందా? 80 కోట్లు ఏంది సామీ.... ప్రభాస్‌ మీద బాలీవుడ్లో సెటైర్లు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాహుబలి-2 సినిమా భారీ విజయం తర్వాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఇండియా వైడ్ సూపర్ స్టార్ అయిపోయాడు. ప్రభాస్‌తో సినిమాలు చేయడానికి ప్రొడ్యూసర్లు క్యూ కడుతున్నారు. అయితే బాహుబలి-2 భారీ విజయంతో ప్రభాస్ తన రెమ్యూనరేషన్ అమాంతం పెంచేశాడని, ఇపుడు సినిమాకు రూ. 80 కోట్లు డిమాండ్ చేస్తున్నాడని బాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది.

బాహుబలి విజయాన్ని ప్రభాస్ తలకెక్కించుకున్నాడని.... అందుకే బాలీవుడ్లో టాప్ స్టార్లయిన సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ లాంటి వారికంటే ఎక్కువ డిమాండ్ చేస్తున్నాడంటూ కొన్ని బాలీవుడ్ వెబ్ సైట్లు సెటైర్లు సంధించాయి.

తెలుగు వారికి తెలుసు ప్రభాస్ ఎలాంటి వాడో..... మరి ప్రభాస్ ఎదుగుదలను బాలీవుడ్ జీర్ణించుకోలేక పోతోందో? ఏమో తెలియదు కానీ ప్రభాస్ మీద ఇలాంటి లేని పోని వార్తలు వడ్డిస్తోంది.

ప్రభాస్ కోసం నిర్మాతల క్యూ..

ప్రభాస్ కోసం నిర్మాతల క్యూ..

ఓ ప్రముఖ బాలీవుడ్ వెబ్ సైట్ కథనం ప్రకారం... చాలా మంది బాలీవుడ్ నిర్మాతలు ప్రభాస్ తో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, ఇప్పటికే ఆయన్ను కొందరు కలిసి మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది.

ప్రభాస్ డిమాండ్‌తో షాక్

ప్రభాస్ డిమాండ్‌తో షాక్

అయితే ప్రభాస్‌ను కలిసిన కొందరు నిర్మాతలు అతడు డిమాండ్ చేస్తున్న రెమ్యూనరేషన్ విని షాకయ్యారని, రూ. 80 కోట్లు ఇస్తేనే సినిమా చేస్తానని అంటున్నాడని.... బాలీవుడ్ వెబ్ సైట్లు ప్రచురించాయి.

బాహుబలికి ఎంత తీసుకున్నాడు?

బాహుబలికి ఎంత తీసుకున్నాడు?

ప్రభాస్ బాహుబలి-ది బిగినింగ్ సినిమాకు రూ. 20 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నాడని, అయితే పార్ట్ 2 ద్వారా మరింత ఎక్కువ పొందినట్లు సదరు బాలీవుడ్ వెబ్ సైట్లు పేర్కొన్నాయి.

బాహుబలి-2 సినిమాకు ఎంత?

బాహుబలి-2 సినిమాకు ఎంత?

ఇండియాలోని అన్ని రికార్డులు బద్దలు కొట్టిన ‘బాహుబలి-ది కంక్లూజన్' సినిమా కోసం ప్రభాస్ రూ. 25 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు మరికొన్ని బాలీవుడ్ వెబ్ సైట్లు పేర్కొన్నాయి.

సల్మాన్ ఖాన్ ఎంత చార్జ్ చేస్తున్నాడు?

సల్మాన్ ఖాన్ ఎంత చార్జ్ చేస్తున్నాడు?

ప్రెస్ జర్నల్ కథనం ప్రకారం.... సల్మాన్ ఖాన్ బాలీవుడ్లో హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసకుంటున్నాడు. అతడు ఒక్కో సినిమాకు రూ. 60 కోట్లు చార్జ్ చేస్తున్నాడు.

అమీర్ ఖాన్ రెమ్యూనరేషన్?

అమీర్ ఖాన్ రెమ్యూనరేషన్?

బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ ఒక్కో సినిమాకు రూ. 50 కోట్లు చార్జ్ చేస్తున్నాడట.

షారుక్ ఖాన్ ఫీజు

షారుక్ ఖాన్ ఫీజు

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ఒక్కో సినిమాకు రూ. 40 నుండి 50 కోట్లు చార్జ్ చేస్తున్నాడు.

భారీగా రెమ్యూనరేషన్ పెంచిన ప్రభాస్

భారీగా రెమ్యూనరేషన్ పెంచిన ప్రభాస్

మరో బాలీవుడ్ వెబ్ సైట్ కథనం ప్రకారం.... ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమా చేస్తున్నాడని, రూ. 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అత్యధికం ప్రభాస్ రెమ్యూనరేషన్ కోసమే కేటాయించారని, దీంతో పాటు ప్రభాస్ మరో రెండు సినిమాలకు కమిటైనట్లు రాశారు.

సాహో

సాహో

కాగా.... ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సాహో సినిమా యాక్షన్ కామెడీ ఎంటర్టెనర్ గా తెరకెక్కుతోంది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యూవి క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు.

నెక్ట్స్ మూవీ కరణ్ జోహార్‌తో?

నెక్ట్స్ మూవీ కరణ్ జోహార్‌తో?

కాగా.... త్వరలో ప్రభాస్ హీరోగా దర్శకుడు రాజమౌళి ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ బేనర్లో ఓ హిందీ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఈ విషయమై ఇప్పటి వరకైతే అఫీషియల్ సమాచారం అయితే లేదు.

English summary
Prabhas has become a superstar after the roaring success of Baahubali 2. Producers are lining up to cast him in their movies. But you will be shocked to know that Prabhas has increased his fee and now wants Rs 80 crore for his next. Well, even Salman Khan, Shahrukh Khan and Aaamir Khan don't charge this much.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu