twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ అవార్డ్స్ అందుకున్న సినీ స్టార్స్ (ఫోటోస్)

    |

    కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా అందించే పద్మ పురస్కారాల ప్రదానోత్సవం సోమవారం(మార్చి 11) న్యూ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ఈ ఏడాది మొత్తం 4 పద్మవిభూషణ్‌, 14 పద్మభూషణ్‌, 94 పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించిన సంగతి తెలిసిందే.

    సినీ పరిశ్రమకు సంబంధించి ప్రముఖ సినీ నటుడు, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌, లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి, ప్రభుదేవా, సహా సినిమా రంగం నుంచి మొత్తం ఏడుగురు పద్మ అవార్డులకు ఎంపికైన సంగతి తెలిసిందే.

    మోహన్ లాల్

    మోహన్ లాల్

    ప్రముఖ సినీ నటుడు, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌‍కు ఆర్ట్-యాక్టింగ్-ఫిల్మ్ విభాగంలో కేరళ నుంచి పద్మ భూషణ్‌కు ఎంపికయ్యారు. ఈ మేరకు ఆయన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా అవార్డ్ అందుకున్నారు.

    ప్రభుదేవా

    ప్రభుదేవా

    ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవాకు ఆర్ట్-డాన్స్ విభాగంలో కర్నాటక నుంచి పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ మేరకు ఆయన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక అవార్డ్ స్వీకరించారు.

    ప్రభుదేవా భావోద్వేగం

    ప్రభుదేవా భావోద్వేగం

    పద్మశ్రీ అవార్డు అందుకోవడానికి ప్రభుదేవా తన తల్లిదండ్రులతో కలిసి హాజరయ్యారు. ప్రజలు తనపై ప్రేమ చూపించడం వల్లే ఈ అవార్డు దక్కిందని, వారికే ఈ అవార్డు అంకితం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన తమిళసాంప్రదాయ పంచెకట్టులో హాజరై అందరినీ ఆకట్టుకున్నారు.

    శంకర్ మహదేవన్

    శంకర్ మహదేవన్

    మహారాష్ట్ర నుంచి ఆర్ట్-వోకల్స్-ఫిల్మ్ విభాగంలో ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్‌కు పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా అవార్డ్ అందుకున్నారు.

    English summary
    Prabhu Deva, South Superstar Mohan Lal and Shankar conferred with Padma Awards by President of India Ram Nath Kovind, at Rashtrapati Bhawan,in New Delhi, on 11 Match,2019.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X