»   » ద్యావుడా...! రాజమౌళికే కాదు...ప్రభుదేవా కలకూడా అదేనట,దాసరి ఏమంటారో

ద్యావుడా...! రాజమౌళికే కాదు...ప్రభుదేవా కలకూడా అదేనట,దాసరి ఏమంటారో

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రపంచానికి మైఖేల్ జాక్సన్ ఎలాగో ఇండియాకి ప్రభుదేవా అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే ఆయన్ని ఇండియన్ మైఖేల్ జాక్సన్ అంటారు. అలాంటి ప్రభుదేవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ గ్రేట్ డాన్సర్ టాలీవుడ్ నుంచి దర్శకుడిగా మారాడు. గత 2 దశాబ్దాలుగా తన డాన్సులతో అలరిస్తున్న ప్రభుదేవా ప్రస్తుతం బాలీవుడ్లో డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. అలాగే ఆయన తీసిన 2 సినిమాలు 100 కోట్ల క్లబ్ లో కూడా చేరాయి.

దర్శకత్వం తెలుగుతో మొదలుపెట్టి.. తమిళంలోకి వెళ్లి.. ఆపై హిందీలో సెటిలయ్యాడు. పదేళ్ల వ్యవధిలోనే అతను డజనుకు పైగా సినిమాలు తీసేయడం విశేషం. ఐతే ఇప్పటిదాకా ఎన్ని సినిమాలు చేసినా. తన డ్రీమ్ మూవీ మాత్రం వేరే అంటున్నాడు ప్రభుదేవా. రామాయణాన్ని హాలీవుడ్ స్థాయిలో ప్రెజెంట్ చేసి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలన్నది ఈ ఇండీయన్ బోన్ లెస్ మ్యాన్ కల అట.ఈ దిశగా ఇప్పటికే పని కూడా మొదలుపెట్టినట్లు అతను చెప్పాడు.

prabhudeva

ఈ మధ్యనే ఒక పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ "గానీ రామాయణాన్ని కానీ భారీ స్థాయిలో తెరకెక్కించాలన్నది నా కల. అది హాలీవుడ్ సినిమాలాగా ఉండాలి. లార్డ్ ఆఫ్ ద రింగ్స్ తరహాలో ఆ సినిమా చేయాలనుకుంటున్నాను. అది సాధ్యమవుతుందో లేదో" అన్నాడు ప్రభుదేవా.

అయితే తెలుగు దర్శక బాహుబలి రాజమౌళి కూడా చాన్నాళ్ల నుంచి "మహాభారతం" కల కంటున్నాడు. ఐదేళ్లకో పదేళ్లకో ఆ సినిమా చేయడం ఖాయమని కూడా అన్నాడు జక్కన్న.

ఇప్పటికే మహాభారతం లోని ఒక భాగాన్ని తీసుకొని "గరుడ" అనే సినిమా కోసం ప్రయత్నిస్తున్నట్టు కూడా వార్తలువచ్చాయి. ఇక ఈదర్శకున్ని పక్కన పెడితే మరోవైపు దర్శక రత్న దాసరి నారాయణరావుకు కూడా మహాభారతం మీద కన్నుంది. ఆ చిత్రాన్ని ఐదు భాగాలుగా తీస్తానని.. ఇప్పటికే రెండు భాగాలకు స్క్రిప్టు వర్క్ కూడా పూర్తయిందని ఆయన ఈ మధ్యే వెల్లడించారు.

ఈ ముగ్గురిలో ఎవరు ఏసినిమా ముందు మొదలు పెట్టినా ఒక అడ్వాంటేజ్ మాత్రం ఉఇంటుంది సేం యుద్దాలూ,రాజభవనలూ, సేం గ్రాఫిక్సూ అవసరమే కనక సెట్ లు కొత్తవి వేయనక్కర లేకుండా ముగ్గురూ ఒకే సెట్ నీ జూనియర్ ఆర్టిస్టులనీ, పంచుకోవచ్చు సమయమూ,నిర్మాతలకి బడ్జెట్టూ కలిసి వస్తాయి ఏమంటారూ...

English summary
Prabhu wants to make the epic Ramayana on the same lines as Hollywood's magnum opus - The Lord of the Rings
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X