»   » బోయ‌పాటి శ్రీను, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చిత్రంలో ప్ర‌గ్యాజైశ్వాల్‌

బోయ‌పాటి శ్రీను, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చిత్రంలో ప్ర‌గ్యాజైశ్వాల్‌

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సూప‌ర్‌, డూప‌ర్ హిట్ చిత్రాల ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ క‌థ‌నాయ‌కుడుగా ద్వార‌క క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌ఫై మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి నిర్మాత‌గా ప్రొడ‌క్ష‌న్ నెం.2. సినిమా ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్తైంది. సరైనోడుతో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఈ ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ రూపొందుతోంది.

బోయ‌పాటి మార్కు యాక్ష‌న్‌, ఎమోష‌న్స్‌తో సాగే ఈ హై బ‌డ్జెట్ చిత్రంలో ప్ర‌గ్యాజైశ్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ను స‌రికొత్త లుక్‌లో స్ట‌యిలిష్‌గా ప్రెజంట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ర‌కుల్ ప్రీత్ సింగ్‌, ప్ర‌గ్యాజైశ్వాల్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

Pragya Jaiswal Joins Boyapati Srinu, Bellamkonda Sai Srinivas, Dwaraka Creations Production No 2

ఈ చిత్రం గురించి చిత్ర నిర్మాత మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ - మా ద్వార‌క క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో బోయ‌పాటి, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో సినిమా చేస్తుండ‌టం ఆనందంగా ఉంది. డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌తో త‌న మార్కు ఎంట‌ర్‌టైన్మెంట్‌తో ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా హై బ‌డ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ చితం ఫ‌స్ట్ షెడ్యూల్‌ను బోయ‌పాటిశ్రీను, బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌, రకుల్ ప్రీత్ సింగ్ స‌హ‌కారంతో రీసెంట్‌గా పూర్తి చేశాం. త్వ‌ర‌లో ప్ర‌గ్యాజైశ్వాల్ షూటింగ్‌లో జాయిన్ అవుతుంది. ఇద్ద‌రి హీరోయిన్స్‌కు స‌మాన ప్రాధాన్య‌త ఉన్న పాత్ర‌ల‌ను ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీనుగారు క్రియేట్ చేశారు. మేకింగ్‌లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమాను రూపొందిస్తున్నాం అన్నారు.

ఈ చిత్రానికి ఆర్ట్ః సాహి సురేష్‌,ప‌బ్లిసిటీ డిజైన‌ర్ః ధ‌ని ఏలే, ఎడిట‌ర్ః కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు, ఫైట్స్ః రామ్‌లక్ష్మ‌ణ్‌, మాటలుః ఎం.ర‌త్నం, సినిమాటోగ్ర‌ఫీః రిషి పంజాబి, మ్యూజిక్ః దేవిశ్రీప్ర‌సాద్‌, నిర్మాతః మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి, క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వంః బోయ‌పాటి శ్రీను.

English summary
New movie from sensational director Boypati Srinu and young hero Bellamkonda Sai Srinivas produced on Dwaraka Creations banner by producer Miriyala Ravinder Reddy will have one more heroine Pragya Jaiswal. The Production No 2 launched recently completed an important first schedule.Boyapati who recently delivered industry hit with Sarrainodu prepared a complete love and family entertainer script for Bellamkonda Sai Sreenivas without missing his brand action, sentiment and technically high budget. Young hero Bellamkonda Sai Sreenivas has undergone a complete stylish makeover to romance young heroines Rakul Preet Singh and Pragya Jaiswal.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu