»   » ఒకన్ని మించినోడు ఒకడు సాలేగాళ్ళు: ప్రకాశ్ రాజ్ పూరీ జన్నాథ్ ని తిట్టాడా పొగిడాడా??

ఒకన్ని మించినోడు ఒకడు సాలేగాళ్ళు: ప్రకాశ్ రాజ్ పూరీ జన్నాథ్ ని తిట్టాడా పొగిడాడా??

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొన్ని సార్లు ప్రకాష్ రాజ్ చాలా నిర్మొహమాటంగా ఉంటాడు. ముక్కుసూటిగా మాట్లాడతాడు ఆ ప్రవర్తన వల్ల చాలా సార్లే చిక్కుల్లో పడ్డాడు. ఒకానొక దశలో తెలుగు సినిమాల్లో ప్రకాశ్ రాజ్ ని తీసుకోవద్దు అని "మా" తీర్మాణించిన సంధర్బాలూ ఉన్నాయి. కానీ ప్రకాశ్ రాజ్ తన యాట్టిట్యూడ్ ని వదులుకోలేదు. నిన్న ఇజం ఆడియో ఫంక్షన్ లో కూడా అదే పద్దతిలో మాట్లాడాడు అయితే పూరీని పొగిడాడా తిట్టాడా అన్న విశయమే అర్థం కాకుండా ఉంది.

పూరిజగన్నాథ్ బూతులకు కూడ తెలుగుదనం అద్దగల సమర్థుడు అంటూ తన స్టైల్లో చెప్పిన ప్రకాశ్ రాజ్ అసలు ఈ మాట కి నెగెటివ్ అర్థం మాత్రం రాకుండా వెంటనే బూతు కూడా ఎవరి నోటి నుండి అయినా అందంగా పలికించాడు అంటే అది పూరి వల్ల మాత్రమే సాధ్యం అని కవర్ చేసాడు. అంతేకాదు బూతు - బూతు పదంలా కాకుండా అది ఒక భాషలా అనిపించేడట్లు చేయడం ఒక్క పూరీకే సాధ్యం అంటూ మాస్ సినిమాకు క్లాస్ టచ్ ఇవ్వగల సమర్ధత ఒక్క పూరిజగన్నాథ్ కు మాత్రమే సొంతం అంటూ మాట్లాడతం తో ఈయన అసలు పూరీని ఏం అంటున్నాడూ అన్నది ఎవరికీ అర్థం కాలేదు.

Prakash Raaj

తను డైరక్ట్ చేస్తున్న ఇజం సినిమా కోసం పూరీ జగన్నాథ్ పాట రాశాడు. ఈ సినిమాలో ఓ కీలకమైన సందర్భంలో వచ్చే పూరిజగన్నాథ్ పాటల రచయితగా మారి 'ఒకడ్ని మించినోడు ఒకడు.. సాలేగాళ్లు.. బ్లాక్ లో కొందామన్నా మంచోళ్లు దొరకట్లా.. సొసైట్ హౌస్ ఫుల్ విత్ లుచ్చాస్ అండ్ లఫంగాస్' అనే పాట కోసం పూరీ స్వయంగా లిరిక్ రైటర్ గా మారిపోయాడు. ఈ పాట ఇప్పుడు ఎందుకు రాయాల్సి వచ్చిందో, పాట ఎలా ఉండబోతుందో స్వయంగా పూరీనే త్వరలో తెలియజేస్తాడని యూనిట్ అంటోంది.

ఇజం అంటూ కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ నుంచి షాకులు ఇస్తూనే ఉన్నాడు పూరీ జగన్నాథ్. ఆ తర్వాత ఇజం టీజర్ తో ఇచ్చిన షాక్ నుంచి కోలుకోవడానికి ఇండస్ట్రీకి కొన్ని రోజులు పట్టేసింది. ఇక అక్టోబర్ లో ఇజం విడుదలకు ప్లాన్ చేస్తుండగా.. ఇప్పుడు ఈ మూవీలోని పాటలకి సంబంధించి ట్రాక్ లిస్ట్ బయటకొచ్చింది. సాధారణంగా అయితే.. ఆడియో రిలీజ్ కాకుండా.. కేవలం లిస్ట్ చూసి చెప్పేందుకు ఏం ఉండదు కానీ.. పూరీ ఈ మూవీకి ఆమాత్రం ప్రత్యేకత ఉంది. అదే.. ఇజంలో పూరీ జగన్నాథ్ రెండు పాటలు పాడేయడం. 'యే.. యే.. యే రా..' అంటూ సాగే పాటతో పాటు 'ఇజం' థీమ్ సాంగ్ ను కూడా పూరీ తనే పాడేశాడు. ఈ మూవీపై తానెంత పట్టుదలగా ఉన్నాడో చెప్పకనే చెప్పాడు పూరీ.

English summary
Actor Prakash raj commented about Poori Jagannath vulgar dialogues in Ijam movie audio function yesterday
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu