»   » మహేష్ ని ప్రశంసిస్తూ ప్రకాష్ రాజ్ ఇలా...

మహేష్ ని ప్రశంసిస్తూ ప్రకాష్ రాజ్ ఇలా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు సినీనటుడు మహేశ్‌బాబు ప్రకటించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తూరు మండలం సిద్దాపురం గ్రామాన్ని ఆయన దత్తత తీసుకోనున్నారు. తెలంగాణ పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్‌ మాట్లాడాక ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు మహేశ్‌ తన ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ప్రకాష్ రాజ్ ఆయన్ను ప్రశంసిస్తూ ఇలా ట్వీట్ చేసారు.

ఇక గ్రామాల దత్తత నేపథ్యంగా మహేశ్‌ నటించిన 'శ్రీమంతుడు' చిత్రం ఇటీవలే విడుదలై ఘన విజయం సొంతం చేసుకుంది. గ్రామాన్ని దత్తత తీసుకునే అంశాన్ని కమర్షియల్‌ పాయింట్‌గా తీసుకుని తెరకెక్కించిన విధానం అందరికి బాగా నచ్చింది. ఈ చిత్రం ఎందరో ప్రముఖులను కదిలించింది.

prakash

ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ శ్రీమంత్రుడు చిత్రాన్ని చూసి మహేశ్‌బాబుపై ప్రశంసల జల్లు కురిపించారు.గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని కోరారు. దీనికి స్పందించిన మహేశ్‌బాబు ఓ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని కేటీఆర్‌కు హామీ ఇచ్చారు.

మహేశ్‌బాబు, శ్రుతిహాసన్‌లు ప్రధాన పాత్రల్లో విడుదలైన 'శ్రీమంతుడు' చిత్రం 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ స్పెషల్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ విషయాన్ని మహేశ్‌బాబు తన ట్విట్టర్‌ ఖాతాలో పేర్కొన్నారు.

చిత్రం విజయం సాధించడానికి కారణమైన, తమపై ఇంతటి ప్రేమాభిమానాలు చూపించిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ఓ కోటీశ్వరుడు గ్రామాన్ని దత్తత తీసుకునే అంశంపై దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూర్చారు.

mahesh
English summary
Actor Prakash Raj lauded Mahesh and tweeted, "Dear mahesh... Proud of u. Wonderful step ahead. Great initiative.. Thank you.. Let's give back to life Cheers.."
Please Wait while comments are loading...