For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రకాశ్ రాజ్‌కు ప్రమాదం.. ధనుష్ మూవీ షూటింగ్‌లో తీవ్ర గాయాలు.. పరిస్థితి ఎలా ఉందంటే!

  |

  దక్షిణాదిలో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ కొద్ది రోజులుగా చెన్నైలో జరుగుతున్న ధనుష్ మూవీ తిరుచిత్రంబళం అనే షూటింగులో పాల్గొంటున్నారు. ఈ చిత్రం ధనుస్ కెరీర్‌లో 44వ సినిమా కావడం గమనార్హం. చెన్నైలో ఆగస్టు 5వ తేదీన ఈ షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రంలో ధనుష్‌తోపాటు టాలెంటెడ్ హీరోయిన్ నిత్యామీనన్, గ్లామర్ తారలు ప్రియా భవానీ శంకర్, రాశీ ఖన్నా, ప్రకాశ్ రాజ్, భారతీరాజా తదితరులు నటిస్తున్నారు.

  ధనుష్, ప్రకాశ్ రాజ్ కాంబినేషన్‌లో

  ధనుష్, ప్రకాశ్ రాజ్ కాంబినేషన్‌లో

  మోస్ట్ టాలెంటెడ్ హీరో ధనుష్, ప్రకాశ్ రాజ్ నటిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తున్నది. ఈ చిత్రానికి మిత్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ధనుష్‌, మిత్రన్ కలిసి సినిమా చేయడం ఇది నాలుగోసారి. యారాడీ నీ మోహిని, కుట్టీ, ఉతమపుథిరన్ చిత్రాలు కలిసి చేశారు. యారాడీ నీ మోహిని చిత్రంతోనే మిత్రన్ దర్శకుడిగా మారారు. ఇక తిరుచిత్రాంబళం వచ్చే ఏడాది రిలీజ్ కానున్నది.

  ఆగస్టు 5వ తేదీ నుంచి షూటింగ్

  ఆగస్టు 5వ తేదీ నుంచి షూటింగ్

  ఇదిలా ఉండగా, ఆగస్టు 5వ తేదీ నుంచి సినిమా షూటింగ్ సజావుగా జరుగుతున్న సమయంలో ప్రకాశ్ రాజ్‌కు ప్రమాదానికి గురయ్యారు. చెన్నైలో ధనుష్ సినిమా షూటింగులో పాల్గొంటున్న ఆయన కింద పడిపోవడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం ఆయన హైదరాబాద్‌కు బయలుదేరారు. స్యయంగా ఆయన ట్వీట్ చేసి ఈ వార్తను అభిమానులకు అందించారు.

  ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేసి..

  ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేసి..

  షూటింగులో ప్రమాద వశాత్తూ జారి కిందపడ్డాను. కాలికి చిన్న గాయం అయింది. నా స్నేహితుడు, నన్ను బాగా చూసుకొనే డాక్టర్ గురువారెడ్డి చేతుల మీదుగా జరిగే సర్జరీ కోసం హైదరాబాద్‌కు బయలుదేరాను. నా ఆరోగ్యం గురించి ఆందోళన పడకండి. నేను బాగానే ఉన్నాను. నేను త్వరగా కోలుకోవాలని కోరుకోండి అంటూ ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా, హైదరాబాద్‌లో ప్రకాశ్ రాజ్‌కు శస్త్ర చికిత్స జరుగుతుంది. ప్రకాశ్ రాజ్ చేతికి తీవ్రంగా గాయాలు అయ్యాయి అని ఆయన సన్నిహితులు వెల్లడించారు.

  ఆయన ఆరోగ్యంపై స్నేహితులు ఆరా

  ఆయన ఆరోగ్యంపై స్నేహితులు ఆరా

  ప్రకాశ్ రాజ్‌ గాయపడ్డారనే విషయం తెలుసుకొన్న ఆయన సన్నిహితులు, స్నేహితులు, తొటి నటీనటులు ఆందోళన చెందారు. వెంటనే ఆయన ఆరోగ్యంపై ఆరా తీసి పరిస్థితిని తెలుసుకొన్నారు. అయితే అంతగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. చేతికి చిన్నగాయమైంది. సర్జరీ ద్వారా చికిత్స చేస్తారనే విషయాన్ని తెలుసుకొని అందరూ ఊరట చెందారు.

  Megastar Chiranjeevi, Vijayashanti బ్లాక్ బస్టర్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ || Filmibeat Telugu
  మా ఎన్నికలకు ముందు గాయాలపాలైన ప్రకాశ్ రాజ్

  మా ఎన్నికలకు ముందు గాయాలపాలైన ప్రకాశ్ రాజ్

  ఇదిలా ఉండగా, ప్రకాశ్ రాజ్‌ త్వరలో జరుగనున్న మూవీ ఆర్టిస్టు ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ పడనున్నారు. ప్రకాశ్ రాజ్ బరిలో దిగడంపై నాన్ లోకల్ అంటూ కొందరు విమర్శలు చేయడాన్ని చిరంజీవి, బాలకృష్ణ తదితరులు తప్పుపట్టారు. ఇలాంటి కీలక పరిస్థితుల్లో ప్రకాశ్ రాజ్ గాయపడటం ఆయన వర్గం ఆందోళన చెందుతున్నది. అయితే త్వరగా ప్రకాశ్ రాజ్ కోలుకోవాలని ఆయన వర్గీయులు కోరుకొంటున్నారు.

  ఇదిలా ఉండగా, ప్రకాశ్ రాజ్ ఇటీవల అల్లుడు అదుర్స్, యువరత్న, వకీల్ సాబ్ చిత్రాల్లో నటించారు. ఆయన నటించిన మేజర్ చిత్రం, అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కేజీఎఫ్2, సుకుమార్ దర్శకత్వంలో పుష్ప, రజనీకాంత్ నటిస్తున్న అన్నాతే, ఎనిమీ, మహేష్ బాబుతో సర్కారు వారి పాట, మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్ సెల్వన్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఆ చిత్రాల షూటింగులో ఉన్నాయి.

  English summary
  Versatile actor Prakash Raj met accident in Dhanush movie Shooting in Chennai. He injured in shooting. He tweeted that, A small fall.. a tiny fracture.. flying to Hyderabad into the safe hands of my friend Dr Guruvareddy for a surgery. I will be fine nothing to worry .. keep me in your thoughts.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X