»   » నాగ బాబు కూతురు నిహారిక సినిమాలో ప్రకాష్ రాజ్

నాగ బాబు కూతురు నిహారిక సినిమాలో ప్రకాష్ రాజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాగబాబు కూతురు నిహారిక హీరోయిన్ గా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. 17న మంచి ముహూర్తం ఉండటంతో ఆల్రెడీ పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించారు కూడా. త్వరలో షూటింగ్ మొదలు కాబోతోంది. నిహారిక తొలి సినిమాకు.....మల్లెలతీరంలో సిరిమల్లె పువ్వు' వంటి ప్రేమకథా చిత్రాన్ని అందించిన రామరాజు ఈ చిత్రానికి దర్శకుడు. ‘ఒక మనసు' సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయం కాబోతోంది. మధుర శ్రీధర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాగ శౌర్య హీరో.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం ప్రకాశ్ రాజ్ ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో నాగశౌర్య తండ్రి పాత్రకి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందట. అందువలన ఆ పాత్రకి ప్రకాశ్ రాజ్ అయితేనే పూర్తి న్యాయం జరుగుతుందని భావించి ఆయనని తీసుకున్నారని అంటున్నారు.

Prakash Raj in Niharika's debut

ఈ సినిమాలో నిహారిక తల్లి పాత్ర ప్రముఖ నటి రమ్య కృష్ణ చేయబోతున్నట్లు సమాచారం. సినిమాలో నిహారిక తల్లి పాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుందని, అందుకే రమ్య కృష్ణ లాంటి స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్టును ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. త్వరలో ఈ విషయమై అపీషియల్ ప్రకటన రానుంది.

హెల్తీ ఎంటర్టెన్మెంట్ సబ్జెక్టుతో ఫీల్ గుడ్ గా ఈ సినిమా ఉంటుందని, మెగా ఫ్యామిలీ ఇమేజ్ ఏమాత్రం డ్యామేజ్ కాకుండా, నటిగా నిహారికకు మంచి గుర్తింపు తెచ్చే విధంగా ఉంటుందని అంటున్నారు. మధుర శ్రీధర్, టీవీ 9 సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎక్కువ భాగం షూటింగ్ వైజాగ్ లో జరుగనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందించనున్నారు.

English summary
Versatile actor Prakash Raj will be playing a key role in ‘Mallelatheeramlo’ director Ramaraju’s ‘Oka Manasu’ (tentative title), starring Naga Shaurya and Niharika Konidela in the lead roles.
Please Wait while comments are loading...