»   » నటి రోజా, ప్రకాష్ రాజ్.... పచ్చి అబద్దం: వర్మ క్లారిటీ

నటి రోజా, ప్రకాష్ రాజ్.... పచ్చి అబద్దం: వర్మ క్లారిటీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించబోయే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా త్వరలో ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో లక్ష్మీ పార్వతి పాత్రలో రోజా నటించబోతోందని, అలాగే ఎన్టీఆర్ పాత్రకు ప్రకాష్ రాజ్‌ను తీసుకోబోతున్నట్లు మీడియాలో ప్రచారం జరుగుతోంది.

ఈ వార్తలపై చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో రోజా, ప్రకాష్ రాజ్ నటిస్తున్నారన్న వార్తల్లో నిజం లేదని, సినిమాకు ఇంకా నటీనటుల ఎంపిక మొదలు పెట్టలేదని వర్మ స్పష్టం చేశారు.

ఈ వార్తలు ప్రచారంలోకి రావడానికి కారణం?

ఈ వార్తలు ప్రచారంలోకి రావడానికి కారణం?

ఈ వార్తలు ప్రచారంలోకి రావడానికి కారణం ఇటీవల పలమనేరులో జరిగిన ప్రెస్ మీట్. ఈ సందర్భంగా కొందరు మీడియా వారు మీ చిత్రంలో రోజా నటించే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు వర్మ స్పందిస్తూ ఇంకా నటీనటులను ఫైనల్ చేయలేదు, ఇప్పటి వరకైతే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, ఆమె సినిమాలో ఉండొచ్చు, ఉండక పోవచ్చు అంటూ వ్యాఖ్యానించారు.

ప్రకాష్ రాజ్ అస్సలు సూటవ్వడు...

ప్రకాష్ రాజ్ అస్సలు సూటవ్వడు...

ప్రకాష్ రాజ్ పేరు ఎలా తెరపైకి వచ్చిందో తెలియదు కానీ.... ఆయన ఎన్టీఆర్ పాత్రకు సెట్టవ్వడని చాలా మంది అభిప్రాయం. బాలీవుడ్ నటుడు శతృఘ్న సిన్హా అయితే ఈ పాత్రకు పర్‌ఫెక్టుగా సెట్టయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

ఇలాంటి సినిమాకు ఆయన ఒప్పుకుంటారా?

ఇలాంటి సినిమాకు ఆయన ఒప్పుకుంటారా?

ఈ సినిమాలో రాజకీయ కోణం ఉండదని దర్శక నిర్మాతలు చెప్పినప్పటికీ.... ఈ చిత్రం టీడీపీ అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉంటుందనే ఓ ప్రచారం అయితే ఉంది. టీడీపీ, బీజేపీ మిత్ర పక్షాలుగా ఉన్న నేపథ్యంలో బీజేపీ పార్టీలో ఉన్న శతృఘ్ణ సిన్హా.... ఒక వేళ వర్మ అడిగితే నటించడానికి ఒప్పుకుంటాడా? లేదా? అనేది ఇప్పుడే చెప్పడం కష్టమే.

చివరి రోజులు ఎన్టీఆర్ పడిన క్షోభను చూపిస్తానంటున్న వర్మ

చివరి రోజులు ఎన్టీఆర్ పడిన క్షోభను చూపిస్తానంటున్న వర్మ

‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాలో చివరి రోజుల్లో ఎన్టీఆర్ పడిన క్షోభను చూపిస్తానని వర్మ ఇటీవల ప్రెస్ మీట్లో ప్రకటించారు. లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి ఎంటరైన సమయం నుండి సినిమా మొదలవుతుందని... అప్పటి నుండి ఆయన తుది శ్వాస వరకు జరిగిన సంఘటనలు సినిమాలో చూపిస్తామని వర్మ తెలిపారు.

English summary
"Media Reports Doing rounds that Prakash Raj and Roja will be featured in Lakshmi’s NTR are absolutely baseless and false." RGV said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu