»   » పార్టీ లో ఫన్: ప్రకాష్ రాజ్, శ్రీనువైట్ల కలిసి..(ఫొటోలు)

పార్టీ లో ఫన్: ప్రకాష్ రాజ్, శ్రీనువైట్ల కలిసి..(ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :మొన్నటిదాకా ఎడమొహం పెడమొహంగా ఉన్న దర్శకుడు శ్రీను వైట్ల, నటుడు ప్రకాష్‌రాజ్‌ మళ్లీ ఒక్కటయ్యారు. ప్రకాష్‌రాజ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఇటీవల జరిగిన వేడుకకు శ్రీను వైట్ల హాజరయ్యారు. తన పాత మిత్రుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

చిత్ర సీమలో భేదాభిప్రాయాలతో విడిపోయిన స్నేహితులు మళ్లీ కలుసుకున్నారు. దోస్త్‌ మేరా దోస్త్‌... అంటూ ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. 'ఆగడు' సినిమా సెట్‌లో చోటు చేసుకొన్న ఓ సంఘటనతో శ్రీను వైట్లకీ, ప్రకాష్‌రాజ్‌కీ మధ్య భేదాభిప్రాయాలు వచ్చిన విషయం తెలిసిందే.

ఇద్దరూ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఒకరినొకరు విమర్శించుకొన్నారు. అయితే ఇప్పుడు ఆ వివాదాన్ని మరిచిపోయి మిత్రులయ్యారు. అలాగే ఇదివరకు విడిపోయిన శ్రీను వైట్ల, రచయితలు కోన వెంకట్‌-గోపీమోహన్‌లు కలిశారు. రామ్‌చరణ్‌ సినిమా కోసం వీళ్లంతా కలిసి పనిచేస్తున్నారు.

పార్టీలో హడావిడి

పార్టీలో హడావిడి

ప్రకాష్ రాజ్ ఇచ్చిన బర్తడే పార్టీ ఆద్యంతం సరదాగా జరిగింది

కొందరికే

కొందరికే

ఈ పార్టీకి తన శ్రేయాలాభిషులైన కొందరు మిత్రులను మాత్రమే ఆహ్వానించాడు

కోన వెంకట్ కూడా

కోన వెంకట్ కూడా

ఈ పార్టీలో కోన వెంకట్ కూడా ఉత్సాహంగా పాలుపంచుకున్నారు.

తమన్ కూడా

తమన్ కూడా

సంగీత దర్శకుడు తమన్ ఈ పార్టీలో పాలుపంచుకున్నారు

గోపిమోహన్ తో

గోపిమోహన్ తో

కోన వెంకట్ తో కలిసి గోపీ మోహన్ కలిసి ఈ పార్టీకు వచ్చారు

వివి వినాయిక్

వివి వినాయిక్

ఈ పార్టీకి దర్శకుడు వివి వినాయిక్ కూడా వచ్చారు.

ఎవరెవరు

ఎవరెవరు

సిద్దార్ద, రాసి ఖన్నా, రెజీనా, బ్రహ్మాజీ, కోన వెంకట్, గోపీ మోహన్ లు వంటి సిని సెలబ్రెటీలు ఈ పార్టీలో పాల్గొన్నారు.

English summary
It is known that Prakash Raj and Sreenu Vaitla have exchanged blows during the time of Aagadu, openly in the media. They have called each other unprofessional and have made many allegations up on one another. But if you think they are rivals, you are totally in a hoax. They have come on good terms again to the surprise of everyone. Sreenu Vaitla was spotted at Prakash Raj's 50th birthday party.
Please Wait while comments are loading...