For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రకాష్ రాజ్ మూడు రోజులు బెడ్ రెస్ట్

  By Srikanya
  |

  హైదరాబాద్: ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్, వివిధ విషయాలపై తన ఆలోచనలు ట్విట్టర్ ద్వారా ఇస్తూండే ప్రకాష్ రాజా తాజాగా తన హెల్త్ గురించి ట్వీట్ చేసారు. ఆయన ట్వీట్ చేస్తూ...కోల్డ్...ఫీవర్...డాక్టర్స్ ...మూడు రోజులు పాటు బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పారు అన్నారు. ఆయన హైదరాబాద్ లోని తన ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్..టెంపర్ చిత్రం తో పాటు పలు చిత్రాల్లో చేస్తున్నారు.

  టెంపర్ గురించి ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో చిత్రం గురించి ట్వీట్ చేసారు. ‘టెంపర్ లో కొన్ని సీన్స్ చూసాను. డార్లింగ్ తారక్...చాలా బాగా చేసారు. పూరి, తారక్ ఇప్పటివరకూ చేయని విధంగా ఎంటర్టైన్ చేస్తారు ఈ సినిమాతో.. ' అన్నారు.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  టెంపర్ లో ప్రకాష్ రాజ్, ఎన్టీఆర్ ల మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయంటున్నారు. వీరి మధ్య వచ్చే ఓ డైలాగుని ట్రైలర్ లో విడుదల చేసారు. ఆ ఇగో డైలాగు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ గా మారింది.

  Prakash Raj Under Bed Rest For 3 Days

  టెంపర్ ... ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదిరిపోతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఓ చానల్ ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ని దక్కించుకుందని తెలుస్తోంది. 7.7 కోట్లకు ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ని ఆ చానల్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

  అలాగే...ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ టీజర్ నూతన సంవత్సర కానుకగా ఈ రోజు విడుదలైన సంగతి తెలిసిందే. ‘ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం. అదే ఒకడు మీదపడితే దండయాత్ర...ఇది దయాగాడి దండయాత్ర' అంటూ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ తో విడుదల చేసిన ఈ టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

  నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ...మా బేనర్లో నిర్మిస్తున్న ‘టెంపర్' చిత్రానికి సంబంధించిన టీజర్ నూతన సంవత్సర కానుకగా ఈ రోజు విడుదల చేసాం. రెస్పాన్స్ బాగుంది. ఎన్టీఆర్ లుక్, స్టైల్స్ ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఇటీవల విడుదలైన సిక్స్ ప్యాక్ లుక్ కి ఎంత పెద్ద రెస్పాన్స్ వచ్చిందో అందరికీ తెలిసిందే. ఇపుడు రిలీజైన టీజర్‌కి దాన్ని మించిన రెస్పాన్స్ వస్తోంది.

  ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంటుగా, ఎంతో పవర్ ఫుల్‌గా ఉంటుంది. ఈ సినిమా బేనర్ ప్రతిష్టను మరింత పెంచే సినిమా అవుతుంది. అలాగే ఎన్టీఆర్ గారి కెరీర్లో, పూరి జగన్నాథ్ గారి కెరీర్లో, నా కెరీర్లో ‘టెంపర్' బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందన్న నమ్మకం నాకు ఉంది. మరో పక్క పోస్టు ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి మొదటి వారంలో వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నాం' అన్నారు.

  ఎన్టీఆర్ సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ, పోసాని కృష్ణ మురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జీ, వెన్నెల కిషోర్, జయప్రకాష్ రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమా ప్రభ, పవిత్ర లోకేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

  ఈ చిత్రానికి కథ: వక్కతం వంశీ, సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, సంగీతం: అనూప్ రూబెన్స్, ఆర్ట్: బ్రహ్మకడలి, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, ఫైట్స్: విజయ్, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే మాటలు దర్శకత్వం: పూరి జగన్నాథ్.

  English summary
  Prakash Raj shared his thoughts like this - 'Cold..fever..doctors order 3 day bed rest .This winters campfire's Chilly misty nights by my pond. And yesssss ...my cigarettes grrrrrrr'-
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X