ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత: విషాదంలో సినీ వర్గాలు.. మహేష్ బాబు, తాప్సీ, మంచు లక్ష్మీ సంతాపం

భారతీయ దేశ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇకలేరు. కరోనావైరస్ కారణంగా హాస్పిటల్‌లో చేరిన ఆయన కొద్దికాలంగా చికిత్స పొందుతున్నారు. సోమవారం ఉదయం కోమాలోకి వెళ్లిపోయారనే వార్తలు మీడియాలో వచ్చాయి. అయితే ఆయన ఆరోగ్యం విషమించడంతో సోమవారం సాయంత్రం న్యూఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, నేతలు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొన్నారు. ఈ సందర్భంగా పలువురు సంతాపం వ్యక్తం చేస్తూ..

అత్యంత తెలివైన రాజకీయ నేత

అత్యంత తెలివైన రాజకీయ నేత

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం దేశానికి, ప్రజలకు తీరని లోటు. ఈ తరం చవకబారు నేతల మాదిరిగా కాకుండా హుందాతనం కలబోసిన, అత్యంత తెలివైన రాజకీయనేత. అతడి నోటి నుంచి వెలువడే బంగారు పలుకులు ఇక వినిపించవు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానుఅని నటి, రాజకీయ నేత కుష్బూ సుందర్ తెలిపారు.

పింక్ సినిమాను ఆయనతో కలిసి చూఢటం

పింక్ సినిమాను ఆయనతో కలిసి చూఢటం

పింక్ సినిమాను ప్రణబ్ ముఖర్జితో కలిసి చూసే భాగ్యం, గౌరవం దక్కింది. సినిమా ప్రదర్శన తర్వాత ఏర్పాటు చేసిన డిన్నర్‌‌ను ఆయనతో కలిసి చేయడం గొప్ప అనుభూతి. ప్రణబ్‌తో కలిసిన అనుభవం ఎప్పుడూ మరిచిపోలేనిది. ఆ రోజు ఆయన చెప్పిన మాటలు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి. మీరు లేని లోటు ఎవరూ పూడ్చలేనిది అంటూ తాప్సీ పన్ను ట్వీట్ చేశారు.

Recommended Video

#PranabMukherjee : మాజీ రాష్ట్రపతి Pranab Mukherjee ఇక లేరు! || Oneindia Telugu
దేశానికి ఆయన చేసిన సేవలు మరిచిపోలేనివి

దేశానికి ఆయన చేసిన సేవలు మరిచిపోలేనివి

ప్రణబ్ ముఖర్జీ మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోయాను. దేశానికి తీరని లోటు. భారత మాజీ రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ సేవలను, ఆయన చేసిన అభివృద్ది పనులు ఎప్పటికి మరిచిపోలేనివి. ఆయన కుమారుడు అభిజిత్‌కు, కుటుంబానికి, లక్షలాది మంది ఆయన అభిమానులకు నా ప్రగాఢ సంతాపం అని రితేష్ దేశ్‌ముఖ్ అన్నారు.

గొప్ప వక్త, రాజకీయ వేత్తను కోల్పోయాం

గొప్ప వక్త, రాజకీయ వేత్తను కోల్పోయాం

భారత్‌ గొప్ప వక్తను, రాజకీయ వేత్తను కోల్పోయింది. దేశంలోనే గొప్ప గౌరవం ఉన్న నేత. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి కోరుకొంటున్నాను అని అజయ్ దేవగణ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

గొప్ప విలువలు ఉన్న నేత

గొప్ప విలువలు ఉన్న నేత

రాజకీయంగా గొప్ప విలువలు, సిద్ధాంతాలు ఉన్న నేతను భారత్ కోల్పోయింది. ఈ తరంలో గొప్ప రాజకీయవేత్త. భారత రత్న, మాజీ రాష్ట్రపతి మరణం దేశానికి ఎంతో లోటు అని బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా ట్వీట్ చేశారు.

దేశం మూగబోయింది..

ప్రణబ్ ముఖర్జీ మరణవార్తతో తీవ్ర విషాదంలో మునిగిపోయాను. ఎందరో నేతలకు స్ఫూర్తినిచ్చిన గొప్ప రాజకీయ కోవిదుడు ఇకలేరనే వార్తతో దేశం మూగపోయింది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం. ప్రణబ్ ముఖర్జి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని మహేష్ బాబు అన్నారు.

నాకు ఆ గౌరవం దక్కింది

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతివార్తతో విషాదంలో మునిగిపోయాను. పలు సందర్భాల్లో ఆయనను కలుసుకొనే అవకాశం, గౌరవం దక్కింది. ఆయన హుందాతనం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. విషాదంలో ఉన్న ప్రణబ్ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని మంచు లక్ష్మీ పేర్కొన్నారు.

పుట్టెడు దు:ఖంలో ఉన్న కుటుంబానికి

గొప్ప రాజకీయ కోవిదుడు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణవార్తతో తీవ్ర విషాదంలో మునిగిపోయాను. పుట్టెడు దు:ఖంలో మునిగిన ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి దేవుడిని ప్రార్థిస్తున్నాను అని రోజా సెల్వమణి అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X