Prashanth neel నుంచి రాబోయే 5 పాన్ ఇండియా సినిమాలు.. అన్ని మన హీరోలతోనే!

కన్నడ ఇండస్ట్రీకి నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చిన ప్రశాంత్ నీల్ KGF చాప్టర్ 2తో అంతకుమించి అనేలా హిట్ అందుకుంటాడాని ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. టీజర్ క్లిక్కవ్వడంతో అందరి చూపు ఆ సినిమాపైనే పడింది. అయితే నేడు ప్రశాంత్ నీల్ పుట్టినరోజు సందర్భంగా అతనితో సినిమాలు చేయబోయే కొంతమంది బర్త్ డే విషెస్ చెబుతూ ఒక క్లారిటీ ఇచ్చేశారు. ప్రశాంత్ నీల్ నెక్స్ట్ చేయబోయే 5 సినిమాలు కూడా మన తెలుగు హీరోలతోనే..

KGF 2 తరువాత చేయబోయే 5 సినిమాలు

KGF 2 తరువాత చేయబోయే 5 సినిమాలు

కన్నడ ఇండస్ట్రీలో మన తెలుగు సినిమాలకు మార్కెట్ ఒక రేంజ్ లో ఉంది. కానీ అక్కడి హీరోలకు ఇతర భాషల్లో అంతగా మార్కెట్ లేదు. ఒక యష్ మాత్రమే మొదటిసారి KGF సినిమాతో భాషతో సంబంధం లేకుండా హిట్టు కొట్టాడు. ఇక ప్రశాంత్ నీల్ KGF 2 అనంతరం చేయబోయే 5 సినిమాలు కూడా మన తెలుగు హీరోలతోనే అని టాక్ వస్తోంది.

 తారక్ కూడా క్లారిటీ ఇచ్చేశాడు

తారక్ కూడా క్లారిటీ ఇచ్చేశాడు


ప్రభాస్ తో సలార్ సినిమాను ఎప్పుడో స్టార్ట్ చేశాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ఎన్టీఆర్ తో ప్రాజెక్టు చేయబోతున్నట్లు ఇటీవల అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. నేడు తారక్ కూడా అతనికి బర్త్ విషెస్ అందిస్తూ సినిమా చేయడానికి చాలా ఆసక్తిగా ఉన్నట్లు ట్వీట్ చెప్పాడు.

వాళ్ళు కూడా అడ్వాన్స్ ఇచ్చారట

వాళ్ళు కూడా అడ్వాన్స్ ఇచ్చారట

ఇక అల్లు అర్జున్ తో కూడా ఆ మధ్య గీతా ఆర్ట్స్ లో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. కొన్ని కథనాలు ప్రకారం KGF 2 బిజినెస్ వ్యవహారం కోసమే అక్కడికి వచ్చినట్లు టాక్ వచ్చింది. అయితే ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం గీత ఆర్ట్స్ కూడా ప్రశాంత్ నీల్ తో సినిమా చేయడానికి అడ్వాన్స్ అయితే ఇచ్చినట్లు తెలుస్తోంది.

Recommended Video

Actor Altaf Hassan Exclusive Interview Part 1 | Battala Ramaswami Biopikku
మరో రెండు సినిమాలు

మరో రెండు సినిమాలు


ప్రభాస్ తో మరొక సినిమా చేయాలని కూడా ముందుగానే ప్రశాంత్ నీల్ ఒక స్టోరీ లైన్ వినిపించినట్లు సమాచారం. ఇక దిల్ రాజుకు ప్రభాస్ కమిట్మెంట్ ఉంది కాబట్టి ఆ కాంబినేషన్ లో సినిమా చేయవచ్చని తెలుస్తోంది. ఇక డివివి.దానయ్య ప్రొడక్షన్ లో కూడా ఒక సినిమా చేయనున్నాడు. అందులో రామ్ చరణ్ నటిస్తాడనే టాక్ అయితే వస్తోంది. దాదాపు ఈ లైనప్ లో 5 సినిమలైతే ఫిక్స్ అని తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ సినిమా అనంతరం ఈ ప్రాజెక్ట్ లపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X