»   » మా సినిమాని రామ్‌గోపాల్‌వర్మ మెచ్చుకున్నారు

మా సినిమాని రామ్‌గోపాల్‌వర్మ మెచ్చుకున్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ సినిమా చూసి మా గురువు రామ్‌గోపాల్‌వర్మ మెచ్చుకున్నారు. చాలామంది బాలీవుడ్ నటులు కూడా సినిమా గురించి ట్విట్టర్‌లో మెసేజ్ పెట్టారు అని చెప్పారు దర్శకుడు ప్రవీణ్ శ్రీ. ప్రవీణ్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'కాళిచరణ్‌'. శ్రీ కరుణాలయం ప్రొడక్షన్స్‌ పతాకంపై బేబీ మనస్విని సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చైతన్య కృష్ణ టైటిల్‌ పాత్ర పోషిస్తున్నాడు. చాందిని హీరోయిన్‌. గీతా ఆర్ట్‌‌స సంస్థ ద్వారా నవంబరు 8న సినిమాని విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగాల ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.

''సమాంతర చిత్రాలు, వాణిజ్య చిత్రాలూ అనే తేడా ఏమీ ఉండదు. ఎక్కువ మందికి చేరేదే వాణిజ్య చిత్రం. అందుకే నా సినిమాని అందరూ చూసేలా తీర్చిదిద్దా'' అంటున్నారు శ్రీప్రవీణ్‌. 'గాయం2'తో దర్శకుడిగా పరిచయం అయ్యారాయన. రామ్‌గోపాల్‌వర్మ శిష్యుడిగా ఆయన బాటలోనే వెళ్తూ వాస్తవాలకు అద్దం పట్టేలా 'కాళిచరణ్‌' చిత్రాన్ని తెరకెక్కించారు. నిర్మాత కూడా ఆయనే

Praveen Sri about his latest kaali Charan Film

ఇక ''గుజరాత్‌లో జరిగిన ఓ సంఘటన ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. దినపత్రికల్లో ఎన్నో సంఘటనలకు మనల్ని కలచి వేస్తుంటాయి. అలాంటి ఘటన నా ఇంట్లో జరిగితే.. నేనెలా స్పందిస్తా అనేదే ఈ సినిమా. వాస్తవ సమాజాన్ని ప్రతిబింబించేలా తెరకెక్కించాం. 80వ దశకం నాటి వాతావరణం తెరపై కనిపిస్తుంది. దాని కోసం చాలా కష్టపడ్డాం. చైతన్య కృష్ణకు ఈ సినిమాతో మంచి పేరొస్తుందనే నమ్మకం ఉంది''అన్నారు.

''చాలా ఆటంకాలు ఎదుర్కొని ఈ సినిమా రూపొందించాం. సెన్సార్‌ వాళ్లూ అభ్యంతరం చెప్పారు. ఓ సంఘటనపై స్పందిచే హక్కు సినిమా వాళ్లకూ ఇవ్వాలి. ఏం జరిగింది? ఎలా జరిగింది? అనే విషయాలను కళ్లకు కట్టినట్టు చెప్పడం తప్పు కాదు కదా? కనీసం సమాజంలో ఒక్క శాతమైనా మార్పు తీసుకొచ్చేందుకు వీలుంటుంది. హాలీవుడ్‌ చిత్రం 'గాడ్‌ ఫాదర్‌' నాకు స్ఫూర్తి. అదో మాఫియా చిత్రంలా అనిపిస్తుంది. కానీ అందులో కుటుంబ బంధాల్ని అందంగా చూపించారు. వర్మ శిష్యులు సాంకేతిక అంశాలపై ఎక్కువ దృష్టి పెడతారు అనుకొంటారు. కానీ మేం కథను నమ్ముతాం. నేను నమ్మిన కథని సమర్థంగా తెరకెక్కించడమే ముఖ్యం'' అని చెప్పారు శ్రీప్రవీణ్‌.

''1980ల్లో గుజరాత్‌లోని పలన్‌పూర్‌లో జరిగిన ఓ యధార్థ సంఘటన స్ఫూర్తితో 'కాళీచరణ్' కథ తయారు చేసుకున్నా. తెలుగు నేటివిటీకి సౌలభ్యంగా ఉంటుందని మహబూబ్‌నగర్‌లోని పాలమూరు నేపథ్యాన్ని సినిమాలో చూపించాను. అంతేకానీ పాలమూరులో జరిగిన సంఘటనలు దీనికి స్ఫూర్తి కాదు'' అని శ్రీప్రవీణ్ చెప్పారు. ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన 'కాళీచరణ్' ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.

English summary
Sri Prawin’s upcoming film Kaalicharan has a new addition, although only in the form of a voice-over. The latest news is that Jagapathi Babu has given a voice over for the film and his voice will be heard in the opening scene where he introduces the story. Chaitanya Krishna and Chandini have played the lead roles in the film whereas Bhojpuri actor Pankaj Kesari is making his debut as a villain. Kavita Srinivasan has played an important role.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu