విలేజ్ లవ్ స్టోరీ ?: త్రివిక్రమ్, నితిన్ 'అ..ఆ' ప్రీలుక్ ఇదిగో
హైదరాబాద్ :ముందే చెప్పినట్లుగానే త్రివిక్రమ్ తన కొత్త సినిమా 'అ..ఆ' ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశాడు. నితిన్ - సమంత కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రం ప్రీ లుక్ పోస్టర్ విడుదల అవగానే అంచనాలు పెరిగిపోయాయి.
ఈ ప్రిలుక్ ఓ వర్గాన్ని ఇట్టే ఎట్రాక్ట్ చేసేసింది. సినిమాలవర్స్ అంతా ... ఇదో ఫీల్ గుడ్ లవ్ స్టోరీలా కనిపిస్తోందని మెచ్చుకుంటున్నారు.
ఈ ప్రీ లుక్ లో హీరో నితిన్ ఓ ట్రావెల్ బ్యాగ్ ను భుజాన వేసుకొని పొలాల్లో నడిచి వెళ్తూంటే. హీరోయిన్ సమంత.. జట్కా బండిలో కూర్చుని వుంది. ఈ లుక్ చూడగానే..ఇదేతో పల్లెటూరి నేపథ్యంలో సాగే స్టోరీగా అనిపిస్తూ ఆకట్టుకుంటోంది.
నితిన్ సరసన సమంత, అనుపమ పరమేశ్వరన్‌లు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై యస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ చిత్రం మే 6న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి దర్శక,నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.
ఇప్పటి వరకూ ఈ సినిమాకు సంబందించిన ఎలాంటి ఫోటోలు బయటకు రాలేదు. సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా తరువాత త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం వేసవి కు రానున్న క్రేజీ ప్రాజెక్టులలో ఒకటి.


Click it and Unblock the Notifications











