»   » పవన్ రాడు.., ఆ కారణాలన్నీ చిరంజీవే చెప్తారు: అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చేసాడు

పవన్ రాడు.., ఆ కారణాలన్నీ చిరంజీవే చెప్తారు: అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చేసాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ఈవెంట్.. అభిమానులు కోటి క‌ళ్ళ‌తో ఎదురు చూస్తోన్న వేడుక‌.. తొమ్మిదేళ్ళ త‌ర్వాత అన్న‌య్య ఆడియో వేడుక‌.. దీనిపై అభిమానులు ఎన్ని ఆశ‌లు పెట్టుకుని ఉంటారు..! కానీ ఇప్పుడు అవ‌న్నీ ఆవిరైపోయాయి. ఆడియో వేడుక లేకుండానే చిరంజీవి సినిమా పాట‌లు మార్కెట్ లోకి వ‌చ్చేస్తున్నాయి. అనగానే ఒక్కసారి మెగా అభిమానులకి ఎక్కడ లేని నిరాశా ఆవరించేసింది.

అయితే ఆ విషయాన్ని కూడా పక్కన పెట్టేసి ప్రీ రిలీజ్ కోసం ఎదురు చూడటం మొదలు పెట్టారు. మెగాస్టార్ చిరంజీవికి ఖైదీ నెం.150 చాలా ప్రిస్టీజియస్ మూవీ. ఇన్నాళ్ల నుంచి కాపాడుకుంటూ వస్తున్న మెగా ఇమేజ్‌కి ఇదో ఛాలెంజింగ్. అందుకే దీని ప్రమోషన్ విషయంలో ట్రైలర్లు, టీజర్లు, ఆఖరకు రూమర్ల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది మెగా క్యాంప్.

 ప్రీ రిలీజ్ ఫంక్షన్‌:

ప్రీ రిలీజ్ ఫంక్షన్‌:

ఇంత ప్లాన్‌గా పోతున్నా.. చిరజీవి 150 సినిమా చుట్టూ రాజకీయాలు ముసురుకుంటున్నా యంటున్నారు. ఖైదీ నెం. 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ని ఆంధ్రప్రదేశ్‌‌లో అట్టహాసంగా చేయాలని ప్లాన్ చేశారు. దీనికి జనవరి నాలుగున ఓకే చేశారు. కారణాలు తెలియరాలేదుకానీ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు నో అనేయడం వివాదాలను రేపింది.

ఆడియో వేడుకలు:

ఆడియో వేడుకలు:

అయితే ఎట్టకేలకు వేదిక ని వేరే చోటికి మార్చి మరీ ఫంక్షన్ ని నిర్వహించాలనుకోవటం తో మళ్ళీ ఉత్సాహం తిరిగి వచ్చింది. ఖైదీ ఆడియో వేడుక ఆగిపోవ‌డం వెన‌క అల్లు అర‌వింద్ మాస్ట‌ర్ బ్రెయిన్ ఉన్న‌ట్లు కొన్ని వార్తలు . ఈ మ‌ధ్య త‌న సినిమాల‌కు కూడా ఆడియో వేడుకలు చేయ‌డ‌మే మానేసాడు ఈ మెగా నిర్మాత‌.

భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్:

భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్:

స‌రైనోడు, ధృవ.. ఇలా ప్ర‌తీ సినిమాకు ఆడియో వేడుక లేకుండానే పాట‌ల్ని మార్కెట్ లోకి విడుద‌ల చేసాడు. ఆ త‌ర్వాత రిలీజ్ కు స‌రిగ్గా వారం రోజుల ముందు భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నాడు. ట్రైల‌ర్ కు మ‌రో ఫంక్ష‌న్ పెడుతున్నాడు. ఇది క‌లిసొస్తున్నందుకే..

 చిరంజీవి సినిమాకు కూడా:

చిరంజీవి సినిమాకు కూడా:

మ్ సెంటిమెంట్ చిరంజీవి సినిమాకు కూడా అప్లై చేస్తున్నాడు అల్లు అర‌వింద్. బావ చెప్పిన ప్లాన్ న‌చ్చ‌డంతో చిరంజీవి కూడా ఖైదీ ఆడియోకు నో చెప్పిన‌ట్లు తెలుస్తోంది. ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. అనుకోకుండా వేదిక మార్చాల్సి రావటంతో ఏర్పాట్లను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

 హాయ్ లాండ్ లో:

హాయ్ లాండ్ లో:

గుంటూరులోని హాయ్ లాండ్ లో ఈ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడగా.. తాజాగా నిర్మాత అల్లు అరవింద్ ఫంక్షన్ కు అనుమతులు వచ్చినట్టుగా ప్రకటించారు. అయితే వేదిక మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో చిరంజీవే వివరిస్తారని తెలిపారు.

పవన్ వస్తాడా రాడా :

పవన్ వస్తాడా రాడా :

రాష్ట్ర ప్రభుత్వం దురుద్దేశంతోనే ఖైదీ వేడుకకు అనుమతి ఇవ్వలేదని మెగా అభిమానులు ఆరోపిస్తున్నారు. మెగా హీరోలందరూ ఈ వేడుకలో పాల్గొంటారన్న ప్రచారం జరుగుతుండగా.. పవన్ వస్తాడా రాడా అన్న అనుమానం అభిమానుల్లో కనిపిస్తోంది. ఈ విషయం పై కూడా క్లారిటీ ఇచ్చాడు అరవింద్.

పవన్ రావటం లేదు

పవన్ రావటం లేదు

పవన్ ఖైదీ వేడుకకు హాజరు కావటం లేదని తెలిపారు. బిజీ షెడ్యూల్ కారణంగానే పవన్ రాలేకపోతున్నారన్నారు. దాదాపు తొమ్మిదేళ్ల విరామం తరువాత చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సినిమా కావటంతో మెగా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అభిమానుల అంచనాలు అందుకునే స్థాయిలో సినిమా ఉంటుందని చిత్రయూనిట్ నమ్మకంగా ఉన్నారు.

English summary
Come this weekend and the pre-release function of actor Chiranjeevi’s 150th movie — Khaidi No 150 — being held at Haailand theme park and resort, is generating plenty of excitement for his fans and has put policemen on their toes.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu