»   » మాజీ లవర్ని ఇరుకున పెట్టిన ప్రీతి.. జైలుశిక్ష తప్పదా?.. సాక్షులుగా క్రికెటర్ తండ్రి, భర్త

మాజీ లవర్ని ఇరుకున పెట్టిన ప్రీతి.. జైలుశిక్ష తప్పదా?.. సాక్షులుగా క్రికెటర్ తండ్రి, భర్త

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  తనపై లైంగిక దాడికి ప్రయత్నించడంతోపాటు అసభ్య పదజాలంతో దూషించాడనే ఆరోపిస్తూ పారిశ్రామికవేత్త నెస్‌వాడియాపై బాలీవుడ్ తార ప్రీతిజింటా కేసు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఐపీల్ జట్టు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌కు వీరిద్దరూ సహ యజమానులుగా ఉన్న సంగతి తెలిసిందే. వీరి మధ్య గొడవ 2014 మే 30వ తేదీన వాంఖేడే స్టేడియంలో జరిగింది. ఈ కేసులో ముంబై మెరైన్ డ్రైవ్ పోలీసులు తాజాగా చార్జిషీట్ దాఖలు చేయడం గమనార్హం.

  ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా

  ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా

  కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో సేడియం టికెట్ల గురించి జట్టు సిబ్బందిపై నెస్ వాడియా దుర్బాషలాడంటూ ప్రీతి జింటా తన ఫిర్యాదులో పేర్కొన్నది. ఆ తర్వాత తనతో గొడవ పడి తనపై అఘాయిత్యానికి ప్రయత్నించాడని ఆమె ఆరోపించింది.

   బెయిల్‌పై నెస్ వాడియా

  బెయిల్‌పై నెస్ వాడియా

  గొడవ సందర్భంగా తన చేతి పట్టుకొని లాగాడాని, అప్పుడు తన చేతికి అయిన గాయాలను ఫొటోలతో సహా పోలీసులకు అందజేసింది. ఈ వ్యవహారంలో ముంబై చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు 200 పేజీల చార్జిషీట్‌ను దాఖలు చేసింది. ఈ కేసులో నెస్ వాడియా 20 వేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్ తీసుకొన్నాడు.

  బ్రేకప్ తర్వాతే వేధింపులు

  బ్రేకప్ తర్వాతే వేధింపులు

  2014 జూన్ 13న ప్రీతిజింటా దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా నెస్ వాడియాపై ఐపీసీ సెక్షన్ 354 (మహిళపై నేరపూరిత దాడి), 506 (నేరపూరిత దాడి), 509 (మహిళపై అశ్లీల పదజాలం, దూషణ) కింద కేసు నమోదు చేశారు. తమ మధ్య బంధానికి పుల్‌స్టాప్ పడిన తర్వాత వేధింపుల పర్వం ఎక్కువైందని ఆమె ఫిర్యాదులో వెల్లడించింది.

  దక్షిణాఫ్రికా క్రికెటర్ తండ్రి సాక్షిగా

  దక్షిణాఫ్రికా క్రికెటర్ తండ్రి సాక్షిగా

  ప్రీతిజింటా, నెస్ వాడియా కేసులో దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ తండ్రి అండ్రూ మిల్లర్ కీలకమైన సాక్షిగా మారడం వివాదం కొత్త మలుపు తిరిగింది. వారిద్దరూ గొడవ పడటం చూశాను. ప్రీతి చేయిపట్టి నెస్ వాడియా లాగడం తాను గమనించలేదు. వారికి నేను దూరంగా కూర్చోవడం ద్వారా సరిగా గుర్తించలేదు అని అండ్రూ మిల్లర్ పేర్కొన్నారు.

  భార్తగా మారిన సాక్షి

  భార్తగా మారిన సాక్షి

  ఈ కేసులో అమెరికా జాతీయుడు జీన్ గుడెనఫ్ కూడా ఓ సాక్షిగా ఉన్నాడు. ఇతడిని 2016లో ప్రీతిజింటా వివాహం చేసుకొన్నది. గొడవ జరిగినప్పుడు తానే జోక్యం చేసుకొని వారిద్దరి విడిపించానని జీన్ గుడెనఫ్ పోలీసులకు చెప్పడంతో ఆయన ఈ కేసులో సాక్షిగా మారారు.

  English summary
  The Marine Drive Police in Mumbai on Tuesday filed a charge sheet against businessman Ness Wadia for allegedly molesting and verbally abusing actress Preity Zinta almost three-and-half years ago. Accroding reports, Wadia was also present and granted bail on a personal surety of Rs 20,000 as the police submitted the 200-page charge sheet in the court of the chief metropolitan magistrate
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more