»   »  రేప్ సీన్ల ఎఫెక్ట్: నాకు భయపడి వారి భార్యలను దాచేవారు!

రేప్ సీన్ల ఎఫెక్ట్: నాకు భయపడి వారి భార్యలను దాచేవారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ చరిత్రలో వెండితెర విలన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రేమ్ చోప్రా. బాలీవుడ్లో నటుడిగా ప్రస్తానం ప్రారంభించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఓ ఆంగ్లపత్రికతో తన అనుభవాలను పంచుకున్నారు.

81 ఏళ్ల ప్రేమ్ చోప్రా... ఇప్పటి వరకు 350కిపైగా చిత్రాల్లో నటించారు. ఆయన నటించిన సినిమాల్లో ఎక్కువగా విలన్‌ పాత్రల్లో చేసినవే అధికం. సినిమాలో హీరోయిన్ మీద అత్యాచారం సీన్ ఉందంటే అందులో తప్పకుండా ప్రేమ్ చోప్రానే ఉండేవాడు.

 Prem Chopra about his 50 year long career

అప్పట్లో నేను రేప్ సీన్లతోనే బాగా పాపులర్ అయ్యాను. సినిమాల్లో కాకుండా నేను బయట కనబడినా భయపడేవారు. అంతలా నేను చేసిన విలనిజం పండింది. కొందరు మగవాళ్లు నన్ను చూసి భార్యల్ని దాచేసేవారు. సినిమాల్లోలాగానే నిజ జీవితంలోనూ ఉంటాననుకునేవారు... రియల్ లైఫ్ లో నేను అందుకు పూర్తిగా భిన్నం అని ప్రేమ్ చోప్రా చెప్పుకొచ్చారు.

నేను హీరో అవ్వాలనే సినిమాల్లోకి వచ్చాను. మొదట్లో నేను హీరోగా చేసిన పంజాబీ సినిమాలు మంచి విజయం సాధించాయి. అయితే బాలీవుడ్లో నేను హీరోగా చేసిన సినిమాలు ప్లాప్ అవ్వడంతో అవకాశాలు రాలేదు. కొందరి సలహా మేరకు విలన్ పాత్రలు చేయడం మొదలు పెట్టాను. విలన్ పాత్రలు నా జీవితాన్ని మలుపు తిప్పాయి అని ప్రేమ్ చోప్రా తెలిపారు.

English summary
One of Bollywood’s most iconic actors, Prem Chopra redefined the big screen bad guy – a sneering, leering villain who commanded as much screen presence as the highly glorified heroes of his time. "Men would hide their wives when they saw me. I would often go talk to them and they were always surprised when they found out that I was just a regular guy, as good as any of them." Prem Chopra said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu