»   » ఆ పెద్ద హీరోకి బలం లేకపోయినా....‘అఖిల్’కి ముప్పే?

ఆ పెద్ద హీరోకి బలం లేకపోయినా....‘అఖిల్’కి ముప్పే?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అఖిల్ అక్కినేని నటించిన తొలి చిత్రం ‘అఖిల్' దీపావళి సందర్భంగా నవంబర్ 11న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యవ హీరో నితిన్ నిర్మించాడు. ‘అఖిల్' విడుదల సమయానికి మార్కెట్లో ఇతర పెద్ద సినిమాలే ఏమీ లేవు. ‘అఖిల్' విడుదల నేపథ్యంలో రవితేజ ‘బెంగాల్ టైగర్' వాయిదా పడింది. రామ్ చరణ్ ‘బ్రూస్ లీ' ఆల్రెడీ ఔటాఫ్ రేస్. ప్రస్తుతం బాక్సాఫీసు బరిలో ఉన్న ‘కంచె', ‘రాజుగారి గది' అప్పటి వరకు డౌన్ అవ్వొచ్చు.

‘అఖిల్' మూవీ దాదాపు ఎలాంటి పెద్ద సినిమాల పోటీ లేకుండానే విడుదలవుతోందని చెప్పొచ్చు. అయితే అఖిల్ సినిమా విడుదైలన మరుసటి రోజే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో' చిత్రం తెలుగులో డబ్ అయి ‘ప్రేమ లీలా' పేరుతో విడుదలవుతోంది.


Prema Leela movie Biggest Hurdle For Akhil

సల్మాన్ ఖాన్ కు తెలుగు మార్కెట్లో పెద్దగా బలం లేక పోయినా.... ఆ సినిమా హిట్ టాక్ వస్తే మాత్రం ‘అఖిల్' సినిమాకు గట్టి తప్పదు అంటున్నారు. సల్మాన్ మూవీ ఫ్యామిలీ ఎంటర్టెనర్ కావడం, రామ్ చరణ్ వాయిస్ ఓవర్ ఇచ్చిన సినిమా కావడంతో మంచి టాక్ వస్తే వసూళ్లు కుమ్మేసే అవకాశం ఉంది.


‘ప్రేమ లీలా' చిత్రానికి సూరజ్ భరత్యాజ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన పలు చిత్రాలు తెలుగులో కూడా వచ్చాయి. బాక్సాఫీసు వద్ద వండర్స్ క్రియేట్ చేసాయి. ఈ నేపథ్యంలో ఈ సారి అఖిల్ సినిమాకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు.

English summary
Film Nagar source said that, Prema Leela movie Biggest Hurdle For Akhil.
Please Wait while comments are loading...