twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    '118' ట్విట్టర్ రివ్యూ: సస్పెన్స్ థ్రిల్లర్‌తో కళ్యాణ్ రామ్.. సినిమాటోగ్రఫీ కేక!

    |

    నందమూరి కళ్యాణ్ రామ్ కు చాలాకాలం తర్వాత పటాస్ చిత్రంతో హిట్ దక్కింది. కానీ ఆ జోరుని కళ్యాణ్ రామ్ కొనసాగించలేకపోయాడు. ఆ తర్వాత నటించిన చిత్రాలన్నీ నిరాశపరిచాయి. ఇక గత ఏడాది అయితే ఎమ్మెల్యే, నా నువ్వే లాంటి డిజాస్టర్ చిత్రాలు ఎదురయ్యాయి. దీనితో కళ్యాణ్ రామ్ తన కెరీర్ ని నిలబెట్టుకోవాలంటే తదుపరి చిత్రం విజయం సాధించడం చాలా కీలకం. దీనితో కళ్యాణ్ రామ్ కమర్షియల్ చిత్రాల్ని పక్కన పెట్టి కొత్త జోనర్ ని ఎంచుకున్నాడు. కళ్యాణ్ రామ్ తాజాగా నటించిన 118 చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్ గా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. డెబ్యూ దర్శకుడు కెవి గుహన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నివేద థామస్, షాలిని పాండే హీరోయిన్లుగా నటించారు. 118 ప్రీమియర్ షోలు ప్రారంభమైన నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆడియన్ రెస్పాన్స్ ఎలా ఉందో చూద్దాం!

    మంచి ప్రయత్నం

    ఇప్పుడే 118 చిత్రం చూశా. మంచి థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న చిత్రం. సినిమా రెండుగంటలే అయినా ఫస్టాఫ్, సెకండ్ హాఫ్ రెండూ గ్రిప్పింగ్ గా ఉన్నాయి. ఉన్నది రెండు పాటలే.. అవి కూడా బావున్నాయి. కంటెంట్ పరంగా 118 చిత్రం మంచి ప్రయత్నం అని చెప్పొచ్చు.

    ఫస్టాఫ్ ఓకె

    118 ఫస్టాఫ్ పరవాలేదనిపించే విధంగా ఉంది. కానీ సెకండ్ హాఫ్ బోరింగ్. కన్విన్సింగ్ గా లేదు.

    బ్యాగ్రౌండ్ సంగీతం

    118 చిత్రంలో కెవి గుహన్ దర్శత్వం చాలా బావుంది. నిర్మాణ విలువలు బావున్నాయి. కళ్యాణ్ రామ్ పెర్ఫామెన్స్, ఎడిటింగ్ ఈ చిత్రానికి బలం. బ్యాగ్రౌండ్ సంగీతం కూడా బావుంది.

    ఆ రెండూ 118కి హార్ట్ లాంటివి

    118 చిత్రం క్రైమ్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో సాగే వైవిధ్య భరితమైన చిత్రం. సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ సంగీత ఈ చిత్రానికి హార్ట్ లాంటివి. కళ్యాణ్ రామ్ తాం నటనతో అదరగొట్టేశాడు. కెవి గుహన్ సిద్ధం చేసుకున్న కథ చాలా బావుంది. 118 చిత్ర యూనిట్ కి కంగ్రాట్స్.

    మంచి కాన్సెప్ట్ కానీ

    118 చిత్ర కాన్సెప్ట్ బావుంది. కానీ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం బాగాలేదు. స్క్రీన్ ప్లే బోరింగ్ గా ఉంది. ఓవరాల్ గా ఇది బిలో యావరేజ్ చిత్రం.

    సెకండ్ హాఫ్ సాగదీశారు

    ఫస్టాఫ్ గ్రిప్పింగ్ గా బావుంది. కానీ సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు అనవసరంగా సాగదీశారు. దర్శకుడు తాను అనుకున్న కథ నుంచి బయటకు వెళ్లకుండా ఉండాల్సింది. చాలా సన్నివేశాలు సినిమా కథని దెబ్బ తీసేలా ఉన్నాయి. నివేత థామస్ నటనతో ఆకట్టుకుంది.

    ఒకసారి ట్రై చేసేలా

    118 చిత్రానికి పర్వాలేదు అని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఒకసారి చూడొచ్చు.

    కళ్యాణ్ రామ్ కెరీర్‌లో బెస్ట్

    118 చిత్రానికి హిట్ టాక్ వస్తోంది. కళ్యాణ్ రామ్ కెరీర్ బెస్ట్ మూవీ. చిత్ర యూనిట్ మొత్తానికి కంగ్రాట్స్.

    ఉత్కంఠ భరితంగా

    118 చిత్రం ఉత్కంఠ భరితంగా ఉంది. సీట్ల అంచున కూర్చుని చూసే చిత్రం. యూఎస్ నుంచి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి.

    సాధించావ్

    118 చిత్రంతో సాధించావ్ బాబాయ్ మహేష్ కోనేరు. 118 చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తోంది. ఇలాంటి చిత్రాలు ఇక ముందు మరిన్ని రాబోతున్నాయి.

    English summary
    Premier Show Talk and twitter review of Kalyan Ram's 118 movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X