»   » రాజమౌళితో సినిమా చేస్తున్నాను.. ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.. మహేశ్

రాజమౌళితో సినిమా చేస్తున్నాను.. ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.. మహేశ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు, ఏఆర్‌ మురుగదాస్‌ కాంబినేషన్‌లో ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌వీఆర్‌ సినిమా ఎల్‌ఎల్‌పీ, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎన్‌.ప్రసాద్‌ నిర్మించిన భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'స్పైడర్‌'. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్‌ సాధించి సూపర్‌హిట్‌ టాక్‌తో విజయవంతంగా ప్రదర్శింబపడుతోంది.

కొరటాల చిత్రంపై మహేశ్

కొరటాల చిత్రంపై మహేశ్

స్పైడర్ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల ప్రిన్స్ మహేష్ మీడియాతో మాట్లాడుతూ.. స్పైడర్ తర్వాత నా తదుపరి చిత్రం కొరటాలగారితో భరత్ అనే నేను సినిమా చేస్తున్నాను. దర్శక నిర్మాతలు మాట్లాడుకున్న తర్వాత సినిమా విడుదల గురించి మరో పది లేదా ఇరవై రోజుల్లో నిర్ణయం తీసుకుంటారు అని అన్నారు.

రాజమౌళి సినిమా గురించి ఆసక్తిగా

రాజమౌళి సినిమా గురించి ఆసక్తిగా

సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సినిమా కమిట్‌మెంట్‌ ఉంది. ఇప్పుడు చేస్తున్న సినిమాలు పూర్తి కావాలి, అలాగే రాజమౌళి వేరే కమిట్‌మెంట్స్‌ ఉన్నాయి. అవి పూర్తయిన తర్వాతే మా కాంబినేషన్‌లో సినిమా ఉంటుంది. రాజమౌళితో సినిమా చేయడానికి నేను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.

స్పైడర్ కొత్త ఎక్స్‌పీరియెన్స్

స్పైడర్ కొత్త ఎక్స్‌పీరియెన్స్

తెలుగులో ఆర్టిస్టులు వేరేగా ఉంటారు. తెలుగులో ఆర్టిస్టులు వేరేలా ఉంటారు. సన్నివేశాలను ఒకేరోజులో రెండు వేర్వేరు భాషల్లో చేయడం కొత్త ఎక్స్‌పీరియెన్స్‌నిచ్చింది. తెలుగు, తమిళంలో తేడా ఏముంటుంది. ఒక టేక్‌ ఎక్స్‌ట్రాగా ఉంటుందంతే కదా, చేసెయవచ్చులే అనుకుని ఫీల్డ్‌లోకి దిగాం. కానీ మూడు రోజుల తర్వాత బై లింగ్వువల్‌ మూవీ చేయడం అంత సులభం కాదని తెలిసొచ్చింది.

రీమేక్ చేస్తున్నట్టు..

రీమేక్ చేస్తున్నట్టు..

తెలుగులో ఓ సన్నివేశాన్ని ఐదారు టేక్స్‌ చేసిన తర్వాత తమిళంలో కూడా ఐదారు టేక్స్‌ పట్టేది. తర్వాత క్లోజప్స్‌కు కూడా అలాగే సమయం పట్టింది. ఒక సినిమాను ఒకేరోజు రీమేక్‌ చేస్తున్నట్లుగా అనిపించింది. ఇప్పుడు కొరటాలగారి సినిమా షూటింగ్‌కి వచ్చినప్పుడు డైలాగ్స్‌ ఇచ్చారు. ఇంతేనా అని అనిపించింది.

మహేశ్‌కు రజనీ కితాబ్

మహేశ్‌కు రజనీ కితాబ్

స్పైడర్ చిత్రాన్ని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ప్రత్యేకంగా వీక్షించారు. ఈ సందర్భంగా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ మాట్లాడుతూ ''సినిమా చాలా బాగుంది. యాక్షన్‌తోపాటు మంచి మెసేజ్‌ కూడా ఈ సినిమాలో వుంది. మురుగదాస్‌ అద్భుతంగా ఈ సబ్జెక్ట్‌ని హ్యాండిల్‌ చేశారు. మహేష్‌బాబు చాలా ఎక్స్‌ట్రార్డినరీగా పెర్‌ఫార్మ్‌ చేశారు. 'స్పైడర్‌'లాంటి మంచి సినిమాని ప్రేక్షకులకు అందించిన యూనిట్‌ సభ్యులందరికీ నా అభినందనలు'' అన్నారు.

తొలి రోజున 51 కోట్లు..

తొలి రోజున 51 కోట్లు..

సెప్టెంబర్‌ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు 51 కోట్ల రూపాయలు కలెక్ట్‌ చేసి సంచలనం సృష్టించింది. ఈ సందర్భంగా నిర్మాతలు ఎన్‌.వి.ప్రసాద్‌, ఠాగూర్‌ మధు మాట్లాడుతూ ''ఓవర్సీస్‌ ప్రీమియర్స్‌లోనే 1 మిలియన్‌ డాలర్లకుపైగా కలెక్ట్‌ చేసి సంచలనం సృష్టించింది. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా 'స్పైడర్‌' మొదటిరోజు 51 కోట్లు కలెక్ట్‌ చేయడం మాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది. ఇంతటి భారీ విజయాన్ని మాకు అందించిన ప్రేక్షకులకు, అలాగే ఇంత భారీ సినిమా చేసే అవకాశం ఇచ్చిన సూపర్‌స్టార్‌ మహేష్‌, మురుగదాస్‌గార్లకు మా కృతజ్ఞతలు'' అన్నారు.

English summary
Superstar Mahesh, AR Murugadoss's Action Entertainer 'Spyder' Presented by Tagore Madhu, Produced by NV Prasad under NVR Cinemas LLP, Reliance Entertainments released yesterday with big openings all over. Part of the spyder promotion, Mahesh babu reaveals that I have commitment with SS Rajamouli. I eagrly watching for that movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X