»   » మురగదాస్ ఆ ఉద్దేశంతోనే అన్నాడా?: ప్రియదర్శన్ ఎందుకంతలా రియాక్ట్ అయ్యాడు!

మురగదాస్ ఆ ఉద్దేశంతోనే అన్నాడా?: ప్రియదర్శన్ ఎందుకంతలా రియాక్ట్ అయ్యాడు!

Subscribe to Filmibeat Telugu

అవార్డులంటేనే.. ఎంతిచ్చి కొనుక్కున్నారో! అనుకునేంత స్థాయికి సినిమా అవార్డులు దిగజారిపోయాయి. ప్రతిష్టాత్మక అవార్డుల విషయంలో సైతం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఇండస్ట్రీ నుంచే ఇలాంటి కామెంట్స్ వినిపిస్తుండటం సగటు సినీ ప్రేక్షకుడికి చికాకు కలిగిస్తున్నాయి.

తాజాగా విడుదలైన జాతీయ చలనచిత్ర అవార్డుల విషయంలోను ప్రస్తుతం వివాదం రేగుతోంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో 'స్పైడర్' తెరకెక్కిస్తున్న ప్రముఖ దర్శకుడు మురుగదాస్ ఈ వివాదానికి కేంద్రబిందువు కావడం గమనార్హం.

జాతీయ అవార్డుల పట్ల పెదవి విరిచిన మురుగదాస్.. ఇదేదో కావాలని ఇచ్చినట్లుందంటూ కామెంట్ చేశాడు. అయితే విమర్శల పట్ల ఎప్పుడూ స్పందించని జ్యూరీ మెంబర్స్.. మురుగదాస్ విషయంలో కౌంటర్ ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది.

priyadarshan counter attack on murugadoss comments

అవార్డుల ఎంపిక విషయంలో చీఫ్ జ్యూరీగా వ్యవహరించిన ప్రియదర్శన్.. మురుగదాస్ వ్యాఖ్యల పట్ల ఘాటుగానే స్పందించాడు. 'జ్యూరీ నిర్ణయమే ఫైనల్. గో టూ హెల్, అక్షయ్ కుమార్‌తో సినిమా చేసేందుకు ప్రయత్నించి, ఆ ఛాన్స్ మిస్సవడంతోనే ఇదంతా చేస్తున్నావేమో!. అక్షయ్ కుమార్‌కు అవార్డు రావడంపైనే నీ జెలసీ అంతా' అంటూ ప్రియదర్శన్ మురుగదాస్ కు కౌంటర్ ఇచ్చాడు.

ప్రియదర్శన్ కామెంట్స్‌ను బట్టి చూస్తే.. మురుగదాస్ 'అక్షయ్'నే టార్గెట్ చేశారా? అన్న కొత్త అనుమానం మొదలైంది. ఏదేమైనా ప్రియదర్శన్ కౌంటర్ పట్ల మురుగదాస్ స్పందిస్తారా? లేరా? అన్నది వేచి చూడాలి. ఇదిలా ఉంటే, 2017 సంవత్సరానికి గాను రుస్తుం చిత్రానికి అక్షయ్ కుమార్ కు ఉత్తమ నటుడి అవార్డు లభించిన సంగతి తెలిసిందే.

English summary
The 64th National Awards have found itself in controversy since the announcement took place few days back. One of the most surprising winners was Akshay Kumar, who won the best actor award for ‘Rustom’ and social media went berserk over the superstar's maiden win.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu