»   » మళ్ళీ మళ్ళీ ప్రియమణే కావాలంటున్న బెల్లంకొండ సురేష్

మళ్ళీ మళ్ళీ ప్రియమణే కావాలంటున్న బెల్లంకొండ సురేష్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మలయాళంలో విజయం సాధించిన 'బాడీగార్డ్' చిత్రంలో వెంకటేష్ హీరోగా చేస్తున్న సంగతి తెలిసిందే. డాన్ శీను దర్శకుడు గోపించద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా ప్రియమణిని ఎంపికచేసినట్లు సమాచారం.గతంలోనూ బెల్లంకొండ సురేష్ నిర్మించిన నాడోడిగల్ రీమేక్ శంభో..శివ శంభో చిత్రంలోనూ ఆమెనే తీసుకున్నారు. ఆ తర్వాత బెల్లంకొండ సురేష్ నిర్మాతగా పూరి జగన్నాధ్ రూపొందించిన గోల్ మాల్ చిత్రంలోనూ ఆమెనే హీరోయిన్ గా తీసుకున్నాడు. ఇప్పుడూ ఈ బాడీగార్డ్ రీమేక్ లోనూ ఆమెనే తీసుకుంటున్నాడని తెలుస్తోంది.

దానకి కారణం ఆమెతో చేయటం కంఫర్ట్గ్ గా ఉంటుందని ఆయన చెప్తున్నారు. ఇక ఈ చిత్రం తెలుగు రీమేక్ చేయటం కోసం చాలా రోజులుగా తెలుగు పరిశ్రమలో చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో మొన్న సంక్రాంతికి ఈ చిత్రం రీమేక్ కావలన్ పేరుతో విడుదలై ప్లాప్ టాక్ తెచ్చుకోవటంతో వెంకటేష్ సోదరుడు సురేష్ బాబు ఈ రీమేక్ కు తన సోదరుడుని చేయటానికి ఒప్పుకోలేదని చెప్తున్నారు. దాంతో ఈ రీమేక్ రైట్స్ ని తీసుకున్న నిర్మాత బెల్లంకొండ సురేష్ డైలమోలో పడ్డారు.

అందులోనూ బెల్లంకొండ సురేష్ నిర్మాతగా నాగవల్లి చిత్రం రీమేక్ కూడా ఫ్లాప్ కావటం కూడా ఈ రీమేక్ పై నమ్మకాలు తగ్గేలా చేసాయి. అయితే బెల్లంకొండ స్క్రిప్టు మార్పించి ప్రెష్ గా నిర్మిస్తానని హామీ ఇచ్చాకే వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటున్నారు. ఇక ఇప్పుడా చిత్రాన్ని సల్మాన్ ఖాన్ హీరోగా హిందీలో రీమేక్‌ చేస్తున్నారు.ఇక మళయాళంలో ఈ చిత్రాన్ని సిద్దికి దర్శకత్వంలో నయనతార,దిలీప్ కాంబినేష్ లో చేసారు.

English summary
Priyamani is most likely to pair up with Venkatesh in ‘Body Guard’ remake.Malineni Gopichand of ‘Don Seenu’ fame is 
 
 getting ready to wield the megaphone for this flick while Bellamkonda Suresh is producing the film on the banner of Sri 
 
 Sai Ganesh Productions.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu