»   » ప్రియమణి ఒక్క రాత్రి కి ఛార్జ్ అంతా?

ప్రియమణి ఒక్క రాత్రి కి ఛార్జ్ అంతా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :ప్రియమణికి ప్రస్తుతం డిమాండ్ లేదు కదా...మనం ఇచ్చినంత తీసుకుంటుంది. చెప్పినట్లు చేస్తుంది అనుకుంటే మీరు తప్పుగా ఆలోచిస్తున్నట్లే. ఆమె తన కెరీర్ లో మైనస్ లో ఉన్నా...రెమ్యునేషన్ విషయంలో పైసా తగ్గించటం లేదు. సరికదా...ఒక్క రాత్రికి పాతిక లక్షలు డిమాండ్ చేసింది. ఆ రాత్రే డిసెంబర్ 31 రాత్రి. రానున్న నూతన సంవత్సర వేడుకలలో ప్రియమణి డాన్స్ చేయడానికి ఒప్పుకుందట. ఆ రోజు రాత్రి డాన్స్ చేసినందుకు ఆమెకు ముట్టచెప్పాల్సిన పారితోషికం అక్షరాలా 25 లక్షలు. ఓ కార్పోరేట్ సంస్ధ ఈ డాన్స్ పోగ్రామ్ నిర్వహిస్తోంది.


ఒకేసారి తన రేటును ఇంత చెప్పేసరికి భయపడిపోయిన నిర్వాహకులు చిట్టచివరికి బేరం ఖరారు చేసుకున్నారని సమాచారం. సినిమాలు రాకపోయినా ఇలాంటి డాన్స్ కార్యక్రమాలు రెండు మూడు వచ్చినా చాలు, ప్రియమణి డైరీ ఫుల్ అయిపోతుంది. సినిమాలెటూ లేవు కదా అని డాన్స్‌లు చేయమని అడిగేవారు కూడా పెరిగిపోయారట. ఎలాగైతేనేం సమయాన్ని వృధా కాకుండా ఏదో విధంగా డాన్స్‌లో, నటనో చేస్తోంది కదా ఈ ఉత్తమ నటి అని ఫిల్మ్ ఇండస్ట్రీలో వారు కామెంట్స్ చేస్తున్నారు.

Priyamani

చండీ తర్వాత ప్రియమణి చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ఉత్తమనటిగా జాతీయ అవార్డు పొందినా, గ్లామర్ హీరోయిన్ గానే ఆమె తన ప్రయాణం కొనసాగించింది. యమదొంగ వంటి భారీ చిత్రాలు చేసినా ఆమెకు కలిసి రాలేదు. ఆమెను ఎంకరేజ్ చేసిన జగపతిబాబు వంటి వారు విలన్ పాత్రల వైపు టర్న్ అయ్యారు. ఈ నేపధ్యంలో ఆమె ఐటం సాంగ్స్, ఇలాంటి న్యూ ఇయిర్ డాన్స్ లు బెస్ట్ అనుకుంటోంది.

ప్రియమణికి చిత్రాలు కరువు అవ్వటానికి కారణం ఉత్తమ నటిగా నేషనల్ అవార్డ్ పొందటమే అంటారు. అంత అవార్డ్ విన్నర్ తమ చిత్రంలో శృంగారం ఒలకపోయదేమోనని చాలామంది నిర్మాతలు ఆమెకు దూరం జరిగారు. దానికితోడు హీరోయిన్ ఓరియెంటెడ్ కథలైతేనే చేస్తానని చెప్పడంతో మరికొందరు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో ఏం చేయలేక చివరికి డాన్స్‌లు చేయడానికి కూడా సిద్ధమైంది ప్రియమణి. అయితే దీంట్లోనూ తన డిమాండ్ ని నిలబెట్టుకోవటం ఆమెకు కొంతలో కొంత ఊరట.

English summary
It’s quite common that every heroine in Industry earns money on New year party’s.Mean while they appear in partys and some of them will give dance performances too.The remuneration will depend upon their craze in public.Some of the heroines remuneration as follows below.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu