twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రియమణి ‘అంగుళీక’

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ప్రియమణి హీరోయిన్‌గా, దీపక్ హీరోగా(సంపంగి, ప్రేమలో పావని కళ్యాణ్, అరుంధతి చిత్రాల హీరో) నిర్మాత కె.వి.వి.సత్యనారాయణ సమర్పణలో శ్రీ శంఖ చక్ర ఫిలింస్ పతాకంపై ప్రేమ్ ఆర్యన్ దర్శకత్వంలో కోటి తూముల, సి.హెచ్.రాంబాబు నిర్మాతలుగా రూపొందుతున్న చిత్రం 'అంగుళీక'. ఈ చిత్రం ప్రారంభోత్సవ పూజా కార్యక్రమం ఈ రోజు సంస్థ కార్యాలయంలో జరిగాయి.

    ఈ సందర్భంగా ప్రియామణి మాట్లాడుతూ...'ఇప్పటి వరకు నేను చేసిన చిత్రాల్లో ఒక టిపికల్ క్యారెక్టర్ ఇది. ప్రతి హీరోయిన్‌కి తన కెరీర్లో చెప్పుకోవడానికి ఒకటి రెండు చిత్రాలు మాత్రమే ఉంటాయి. నాకు అవార్డులు వచ్చిన చిత్రాలు ఒక ఎత్తు అయితే, ఈ చిత్రంలో పాత్ర మరో ఎత్తు. అంత గర్వంగా చెప్పుకోగలిగే పాత్ర ఇది. 'అరుంధతి' చిత్రంలో అనుష్కకు ఎంత పేరొచ్చిందో నాకు ఈ చిత్రం ద్వారా అంతే పేరు వస్తుంది. ఈ చిత్ర దర్శకుడికి ఇది మొదటి చిత్రమైనా, నా పాత్ర మలిచిన తీరు అద్భుతం. అందుకే ఈ చిత్రాన్ని చేయడానికి ఒప్పుకున్నాను' అన్నారు.

    హీరో దీపక్ మాట్లాడుతూ..'ఇప్పటి వరకు లవర్ బోయ్ పాత్రల్లో నటించాను. హిందీ చిత్రాల్లో బిజీగా ఉండటం వల్ల తెలుగు చిత్రాలు చేయలేక పోయాను. ఇన్నాళ్లకు నాకు మళ్లీ తెలుగులో మంచి పాత్ర లభించింది. ఆరు వందల సంవత్సరాల క్రితం జరిగే కథ ఇది. అందులో నా పాత్ర రాబిన్ హుడ్ లాంటి ఒక యోధుడి పాత్ర. యువరాణిని ప్రేమించే ప్రేమికుడి పాత్ర. 'అరుంధతి' చిత్రంలో లాగా గెస్ట్ రోల్ మాత్రం కాదు. సినిమా ఆద్యంతం నా పాత్ర ఉంటుంది. ఈ పాత్ర నాకు లభించడం అదృష్టంగా భావిస్తున్నాను' అన్నారు.

    దర్శకుడు ఫ్రేమ్ ఆర్యన్ మాట్లాడుతూ..'ఆరు వందల సంవత్సరాల క్రితం జరిగే కథలో కాలచక్రంతో ముడిపడి ఉన్న ఇరువురి ప్రేమికుల కథ. జన్మాంతరాలు దాటి సాగే ఆత్మసంబంధాల ప్రేమ ప్రయాణంలో ప్రతి జన్మ ఓ మజిలీ. ఆ ప్రేమ జంటకు ఓ దుష్ఠాత్మ వలన విఘాతం ఎదురైతే ప్రళయంగా మారన ప్రణయపు కథే ఈ అంగుళీక. నేను హిందీ దర్శకుడు మణిశంకర్ వద్ద రెండు సంవత్సరాలు పని చేసాను. తెలుగులో కూడా దర్శకత్వ శాఖలో ఐదు చిత్రాలకు పని చేసాను. స్వతహాగా నేను చిత్రకారుణ్ణి, యానిమేటర్ అయినందున నా మొదటి చిత్రం విజువల్ వండర్స్ క్రియేట్ చేయ్యాలని ఈ కథను ఎన్నుకున్నాను' అన్నారు.

    నిర్మాతలు మాట్లాడుతూ...'ప్రియమణి, దీపక్ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు ఆర్యన్ అతను చెప్పింది చెప్పినట్లు తీస్తాడనే నమ్మకంతో ఖర్చుకు వెనకాడకుండా నిర్మిస్తున్నాం. జనవరి మొదటి వారం నుండి షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభిస్తాం, మార్చి వరకు షూటింగ్ పూర్తి చేసి ఏప్రిల్ నెలలో విడుదల చేస్తాం. సినిమా కథకు తగిన విధంగా తిరుపతిలో ఓ భారీ సెట్ వేస్తున్నాం' అన్నారు.

    ఇతర ముఖ్యపాత్రల్లో కోట శ్రీనివాసరావు, సుమన్ శెట్టి, మంజు భార్గవి నటిస్తున్నారు. ఈచిత్రానికి కెమెరా: చిట్టిబాబు, సంగీతం: శ్యామ్ ప్రసన్, మాటలు: గోపి, సుదర్శన్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, ఆర్ట్: వెంకటేష్, ఫైట్ష్: దళపతి దినేష్, కో డైరెక్టర్: కస్తూరి శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శశి, శివ సిర్రి, నిర్మాతలు: తూముల కోటి, సి.హెచ్.రాంబాబు, దర్శకత్వం: ప్రేమ్ ఆర్యన్.

    English summary
    Priyamani new movie 'Angulika' was launched today. Prem Aryan director of this movie and Deepak opposite Priyamani.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X