»   » ఎవరు తప్పు చేసినా అది తప్పదని తెలిసింది: ప్రియమణి

ఎవరు తప్పు చేసినా అది తప్పదని తెలిసింది: ప్రియమణి

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాలుగైదు సినిమాలు చేసేంత వరకూ ఆ భయం పోలేదు. ఆ తరువాత సెట్‌లో ఎలా ఉండాలో అర్థమైంది.దర్శకుడు వన్‌మోర్‌ చెబితే తప్పు నా ఒక్కదానిదే కాదని, మిగతా వాళ్లు ఎవరు తప్పు చేసినా అది తప్పదని తెలిసింది అంటూ గతాన్ని గుర్తు చేసుకుంది ప్రియమణి.ఆమెను మీరు సెట్లో ఎలా మూవ్ అవుతారు అని అడిగినప్పుడు ఇలా స్పందించింది.అలాగే హీరోయిన్ గా కెరీర్ మొదలయిన తొలి రోజుల్లో గందరగోళంగా ఉండేది.ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలిసేది కాదు.బెదురుచూపులు చూసేదాన్ని.'వన్‌ మోర్‌' అని డైరక్టర్ చెప్పినప్పుడు మరింత కంగారు వచ్చేసేది.

ఆ సమయంలో నా హీరోలు అందించిన సహాయ సహకారాలు మర్చిపోలేను. జగపతిబాబు, ఎన్టీఆర్‌, నాగార్జున, రవితేజ, గోపీచంద్‌.... వీళ్లంతా నాకెంతో సహకరించారు. జగపతిబాబుతో తప్ప ఎవరితోనూ మరోసారి కలిసి నటించే అవకాశం రాలేదు. వస్తే ఆ అవకాశాన్ని అస్సలు వదులుకోను అంటోంది.రీసెంట్ గా ఆమె రెండో హీరోయిన్ గా బోయపాటి,ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందే చిత్రంలో ఎంపికయినట్లు సమాచారం. ఆ చిత్రంలో శృతిహాసన్ మొదటి హీరోయిన్ గా చేస్తోంది.

English summary
Priyamani is all set to romance NTR Jr. again. She has been penciled into do the second female lead in Boyapati, NTR film says the buzz. Shruti Hassan is playing the female lead in it.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu