»   » బేవాచ్ తోనే హాలీవుడ్ ఆశలు కూలిపోతాయా??? ప్రియాంక విషయం ఏమిటంటే

బేవాచ్ తోనే హాలీవుడ్ ఆశలు కూలిపోతాయా??? ప్రియాంక విషయం ఏమిటంటే

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రియాంకా చోప్రా నటించిన హాలీవుడ్ మూవీ బేవాచ్ న్యూ యార్క్ లో రివ్యూ షో వేశారు. ఈ సినిమా ఇండియాలో జూన్ లో విడుదలకానుంది. బేవాచ్ మొత్తం బిగ్ - బొంబాస్టిక్ యాక్షన్ తప్పితే మరేది లేదు అని తేటతెల్లం చేశారు రివ్యూయర్లు. ఈ కామిడీ యాక్షన్ మూవీని వెస్టర్న్ క్రిటిక్స్ ఘాటుగానే విమర్శించారు.

విక్టోరియా లీడ్స్

విక్టోరియా లీడ్స్

కానీ సినిమా మొత్తం మీద చెప్పుకోతగ్గది ఒక ప్రియాంకా చోప్రా గ్రేస్ ఆమె నటనే అని ప్ర‌శంసించారు. . ప్రియాంకా బేవాచ్ లో చేసిన విక్టోరియా లీడ్స్ పాత్ర సినిమాను నిలబెట్టింది అని చెబుతున్నారు. ఏదేమైనా ప్రియాంక ఒక్కత్తే ఈ సినిమాలో బెటర్ అనడం.. ఆమెకు ప్లస్సే కాని.. సినిమాకు మైనస్....

తుపాకీ

తుపాకీ

ఇక ఇవన్నీ పక్కన పెడితే "ప్రమాదకరమైందే అందంగా ఆకర్షిస్తుందీ" అని ఒక చైనీస్ సామెత ఉంది. ఇదిగో ఇక్కడ ప్రియాంక ని చూస్తే... ముఖ్యంగా ఆ తుపాకీ ని చూస్తే అది నిజమే అనిపించక మానదు. మొత్తానికి ఒక్క తుపాకీతో అమ్మడు కైపెక్కేచ్చేసింది. ఇదంతా కూడా బేవాచ్ మూవీ ఫోటో షూట్ కోసం ప్రియాంక దిగిన సదరు ఫోటో గ్యాలరీ నుండి బయటపడిన ఫోటోలో ఉన్న హాట్నెస్ అని వేరే చెప్పక్కర్లేదు.

రెడ్ కలర్ డ్రెస్ లో

రెడ్ కలర్ డ్రెస్ లో

గతంలో బేవాచ్ మూవీలో తన కేరక్టర్ కి సంబంధించిన ఓ పోస్టర్ ని రిలీజ్ చేసిన ప్రియాంక రెడ్ కలర్ డ్రెస్ లో భలే మెరిసిపోయింది.. బ్యాడ్ గా ఉండడం కూడా చాలా మంచిదే కావచ్చు అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్ కూడా పెట్టింది. ఈ సినిమాలో ప్రియాంక విక్టోరియా లీడ్స్ అనే నెగిటివ్ రోల్ చేసింది.

బాలీవుడ్ కి టాటా చెప్పినట్లే

బాలీవుడ్ కి టాటా చెప్పినట్లే

బేవాచ్ మూవీపై ప్రియాంక చోప్రా చాలానే హోప్స్ పెట్టుకుంది. ఎందుకంటే ప్రస్తుతం బాలీవుడ్ కి టాటా చెప్పినట్లే కనిపిస్తున్న ఈ బ్యూటీ హాలీవుడ్ లోనే సెట్ కావాలనుకుంటుంది. హాలీవుడ్‌ టీవీ సిరీస్‌ 'క్వాంటికో'తోపాటు హాలీవుడ్‌ మూవీ 'బేవాచ్‌' కోసం చాలా బాలీవుడ్‌ ఆఫర్లను ప్రియాంకా చోప్రా వదిలేసుకుంది.

చాలా ఆశలే పెట్టుకుంది

చాలా ఆశలే పెట్టుకుంది

మరి, ఇంత త్యాగం చేసి ప్రియాంక సాధించిందేంటి.? అంటే, ప్చ్‌.. అప్పుడే చెప్పేయలేం.! ప్రియాంకా చోప్రా అయితే ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకుంది. అటు క్వాంటికో, ఇటు బేవాచ్‌ మూవీ తనకు హాలీవుడ్‌లో మంచి గుర్తింపుని తెచ్చిపెడ్తాయని అంటోంది. ఇప్పటికే క్వాంటికో సంచలనాలు సృష్టించేస్తోందని చెబుతోంది ప్రియాంక.

లాభమా.., నష్టమా

లాభమా.., నష్టమా

అందుకే ఈ సినిమా హిట్టు అయితే కానీ హాలీవుడ్ లో ప్రియాంకకు ఛాన్స్ లు వచ్చేలా కనిపించడం లేదు. దీనికి తోడు క్వాంటికో సిరీస్ ని ఇక కొనసాగించక పోవచ్చనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇప్పుడీ బేవాచ్ తో సక్సెస్ కొట్టడం ప్రియాంకకు చాలా అవసరం. మరి ప్రియాంక భవిశ్యత్ ఏమిటో తెలియాలంటే ఇంకో వారం ఆగాలి.. అప్పుడు గానీ బేవాచ్ వల్ల ప్రియాంకకి లాభమా.., నష్టమా అన్నది చెప్పలేం .

English summary
Priyanka Chopra’s Baywatch reviews aren’t bothering her, she is relaxing and gearing up for bigger things
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu