For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బట్టలు నా వ్యక్తిగతం, మీరు కాస్త....: బికినీ పై ప్రియా మేడమ్ సమాధానం

  |

  ఒకప్పుడు బాలీవుడ్ స్క్రీన్‌పైనే తమ అందాలను ఆరబోసిన ముద్దుగుమ్మలు ఇప్పుడు హాలీవుడ్ రేంజ్‌కు ఎదిగిపోవడంతో వాళ్ల సినిమాలపై మనవాళ్లకు ఆసక్తి పెరిగింది. దీపికాపదుకొనే ట్రిఫుల్ ఎక్స్ మూవీలో నటించడం, ప్రియాంక బేవాచ్ మూవీలో యాక్ట్ చేయడంతో మరికొందరు కూడా వారిబాటలో పయనించేందుకు రెడీ అవుతున్నారు. అయితే దీపిక కెరీర్ అక్కడ పెద్దగా ఏమీ కనిపించటంలేదు గానీ దీపికా తో పోలిస్తే ప్రియాంకా పరిస్థితి చాలా మెరుగనే చెప్పలి.

  ప్రియాంకా చోప్రా

  ప్రియాంకా చోప్రా

  హాలీవుడ్ లో బేవాచ్ పెద్దగా ఆడక పోయినా ఇండియన్ క్రేజీబ్యూటీ ప్రియాంకా చోప్రా మీద ఆ ప్రభావం అస్సలు పడలేదు. బాలీవుడ్ లో హాట్ ఇమేజ్ ఉన్న ప్రియాంకాకు అనుకోకుండా హాలీవుడ్ సీరియల్ లో ఛాన్స్ వచ్చింది. క్వాంటికో సీరీస్ లో రెచ్చిపోయి అక్కడి ఆడియెన్స్ ను బాగా ఎట్రాక్ట్ చేసింది. ఇక ఆ క్రేజ్ తోనే హాలీవుడ్ సినిమా బేవాచ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక ఇప్పుడు హాలీవుడ్‌లో మూడో ఫిల్మ్ చేస్తున్న విషయం తెల్సిందే. ఆ ఫిల్మ్ పేరు "ఈజ్ నాట్ ఇట్ రొమాంటిక్".

   ఏం చేసినా వివాదమే

  ఏం చేసినా వివాదమే

  ఇవన్నీ పక్కన పెడితే ఈ మధ్య పాపం ప్రియాంక ఏం చేసినా వివాదమే అవుతోంది. ఆ మధ్య ప్ర‌ధానిని క‌లిసిన బేవాచ్ బేబీ ఆ మీటింగ్ కోసం స్క‌ర్ట్‌ వేసుకున్న‌ది. ఇద్ద‌రూ కూర్చీలో కుర్చుని మాట్లాడుకున్నారు. అయితే కాళ్లు క‌నిపించేలా ప్రియాంకా స్క‌ర్ట్‌ వేసుకుకోవ‌డం ప‌ట్ల సోష‌ల్ మీడియాలో వ్య‌తిరేక‌త వ్య‌క్తమ‌య్యింది.ఆ తర్వాత మళ్ళీ ఆమె నటిస్తున్న సినిమా "ఈజింట్ ఇట్ రొమాంటిక్" క్లిపింగ్స్, ఫొటోలు కూడా వివాదాస్పదమయ్యాయి.

   ఇంత సెక్సీగా కనిపిస్తూ..

  ఇంత సెక్సీగా కనిపిస్తూ..

  స్వతంత్ర దినోత్సవం సందర్భంగా హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని చెబుతూ నా గుండె ఎప్పుడు ఇండియాలోనే ఉంటుంది అని తన భావాన్ని చెప్పటానికన్నట్టు చెప్పటానికి ఒక ఫొతో పోస్ట్ చేస్తే, ఇంత సెక్సీగా కనిపిస్తూ.. జెండాను మెడలో వేసుకుంటావా? అంటూ మళ్ళీ మొదలు పెట్టారు. వినీ వినీ బోరుకొట్టిందేమో గానీ ఈ మధ్య ఇక వాటన్నిటికీ ఆన్సర్ ఇచ్చేసింది.

   అది నా వ్యక్తిగతం

  అది నా వ్యక్తిగతం

  'నా డ్రెస్సింగ్‌ గురించి అనవసరమైన వివాదాలొస్తున్నాయి.. అది నా వ్యక్తిగతం. ఓ మహిళ వస్త్ర ధారణపై నీఛంగా కామెంట్‌ చేసే స్థాయి నుంచి కొందరు ఎదగాలి.. హుందాతనం అలవాటు చేసుకోవాలి..' అని ప్రియాంక క్లాస్‌ పీకింది. అంటే నా ఇష్టం నా బట్టలూ అని డైరెక్ట్ గా చెప్పేసిందన్నమాట

  ఆ సీన్‌లో శారీ కట్టుకోలేం కదా.?

  ఆ సీన్‌లో శారీ కట్టుకోలేం కదా.?

  స్విమ్మింగ్‌ పూల్‌లోనూ, బీచ్‌లోనూ స్విమ్‌ చేయాల్సిన సీన్‌లో శారీ కట్టుకోలేం కదా.? అంటూ ప్రశ్నించిన ప్రియాంక, బాలీవుడ్‌ సినిమాల్లోనూ బికినీల్లో కన్పించాననీ, హాలీవుడ్‌ సినిమాల్లో అది ఇంకా కామన్‌ థింగ్‌ అనీ, ఆ విషయానికే కొందరు రాద్ధాంతం చేయడం నవ్వు తెప్పించిందని చెప్పింది.

  విజయ్‌ నా ఫేవరెట్‌ హీరో.

  విజయ్‌ నా ఫేవరెట్‌ హీరో.

  సౌత్‌లో ఏ హీరోతో నటించాలని వుంది.? అన్న ప్రశ్నకి, 'విజయ్‌ నా ఫేవరెట్‌ హీరో..' అని సమాధానమిచ్చింది ప్రియాంకా చోప్రా. 'తిట్టేవాళ్ళు తిట్టనీ.. అది నా ఎదుగుదలకు ఉపయోగపడ్తుంది.. కొన్నిసార్లు, వారి విమర్శల్లోంచి కొన్ని పాజిటివ్‌ పాయింట్స్‌ని పిక్‌ చేసుకుంటా.. అదే నా స్ట్రాంగ్‌నెస్‌ సీక్రెట్‌..' అని ఓ ప్రశ్నకి ప్రియాంక సమాధానమిచ్చింది.

  English summary
  Priyanka Chopra's dress was criticised on social media, but the actress shut all the trolls and turned everyone on her side
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X