For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కేవలం సెక్స్ కోసం అలా చేయట్లేదు, వాళ్ళకి అదొక సాటిస్ఫాక్షన్: ప్రియాంకా చోప్రా

  |

  ఎప్పుడైనా, ఎక్కడైనా ఆకతాయిల నుంచి మీకెదురైన లైంగిక వేధింపులను సవివరంగా రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలంటూ.. ప్రపంచవ్యాప్తంగా ఒక ఓపెన్ కాల్ ప్రచారంలోకొచ్చింది. సెక్సువల్ హరాస్ మెంట్ అభియోగాలు ఎదుర్కొంటున్న హాలీవుడ్ ప్రొడ్యూసర్ హార్వీ వీన్ స్టీన్ కు వ్యతిరేకంగా ఈ ఉద్యమం అక్టోబర్ 15న మొదలైంది. ''ఒక ఫ్రెండ్ గా చెబుతున్నా.. పంటిబిగువున భరించింది చాలు.. ఇకనైనా ఓపెనప్ కండి.. మగాళ్లలోని మురికితనాన్ని ఎండగట్టండి.. మీకెదురైన వేధింపుల్ని ప్రపంచం ముందు పెట్టండి'' అంటూ నటి అలీసా మిలానో ట్వీట్ చేసిన తర్వాత.. ''# Me Too'' కాన్వాసింగ్ ఇంకా ఇంకా ఊపందుకుంది. . ఇదే విషయం మీద బాలీవుడ్ నుంచీ హాలీవుడ్ కి వెళ్ళిన ప్రియాంకా చోప్రా స్పందించిన తీరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మన్ననలు అందుకుంటోంది.

   లైంగికంగా వేధింపబడ్డాం అంటూ స్టేట్మెంట్లు

  లైంగికంగా వేధింపబడ్డాం అంటూ స్టేట్మెంట్లు

  హాలీవుడ్లో హార్వే వీన్‌స్టీన్ అనే ప్రొడ్యూసర్ గురించి న్యూయార్క్ టైమ్స్ పత్రిక చేపట్టిన సీక్రెట్ కథనం పెనుసంచలనాలకే తావిచ్చింది. ఎంతోమంది స్టార్ హీరోయిన్లు సైతం ఇతని చేతిలో లైంగికంగా వేధింపబడ్డాం అంటూ స్టేట్మెంట్లు ఇవ్వడం పెద్ద రచ్చకే దారితీసింది.

  టాప్ స్టార్ స్థాయిలో ఉన్నవాళ్ళే

  టాప్ స్టార్ స్థాయిలో ఉన్నవాళ్ళే


  ఒకరా ఇద్దరా పదుల సంఖ్యలో హార్వే బాదిత హీరోయిన్లంతా దాదాపుగా టాప్ స్టార్ స్థాయిలో ఉన్నవాళ్ళే, ఏంజిలినా జోలీ, కేట్ విన్స్లేట్ వంటి హాలీవుడ్ అగ్ర తారలే కాదు.., ఆఖరికి మన బాలీవుడ్ అందం ఐశ్వర్యా రాయ్ ని కూడా పొందాలని ప్రయత్నించాడట ఈ సెక్స్ పర్వర్ట్.

  #MeToo

  #MeToo

  అయితే ఈ సందర్భంగా బాధించిపబడిన చాలామంది సినీ సెలబ్రిటీలూ టివి నటీమణులు.. #MeToo అంటూ ట్విట్టర్లో ఓపెన్ అయిపోతున్నారు. నేను కూడా ఎదుర్కొన్నాను అంటూ మన పరిశ్రమల్లోనూ అయితే ఈ సందర్భంగా బాధించిపబడిన చాలామంది సినీ సెలబ్రిటీలూ టివి నటీమణులు.. #MeToo అంటూ ట్విట్టర్లో ఓపెన్ అయిపోతున్నారు.

  నేను కూడా ఎదుర్కొన్నాను

  నేను కూడా ఎదుర్కొన్నాను


  నేను కూడా ఎదుర్కొన్నాను అంటూ కృతి కర్భందా.. దీని గురించి విన్నాను అంటూ రాధికా ఆప్టే ఓపెన్ అయ్యారు. ఈ విషయం పై అమెరికాలోని ఒక ప్రోగ్రామ్ లో మాట్లాడాల్సిందిగా హాలీవుడ్ హీరోయిన్ గా ఎదుగుతున్న ప్రియాంక చోప్రాను అడిగితే.. అమ్మడు భలే స్టేట్మెంట్ ఇచ్చింది. ''ఇలా వేధించే పర్వం ఇండియాలో కూడా ఉంది.

   కేవలం సెక్స్ కోసం అలా చేయట్లేదు

  కేవలం సెక్స్ కోసం అలా చేయట్లేదు

  మీరు సినిమా ఇండస్ట్రీల్లోనే ఉందని అనుకోవద్దు. ఏ రంగంలో లేదో చెప్పండి? అన్ని రంగాల్లోనూ కొందరు పురుషులు మహిళలను ఇలా వేధిస్తున్నారు. అయితే వారు కేవలం సెక్స్ కోసం అలా చేయట్లేదు. పవర్ కోసం చేస్తున్నారు. ఒక అమ్మాయిని భానిస చేసుకుంటే.. అందులో శాటిస్ఫై అయ్యే మగ అహంకారం కోసం అలా చేస్తున్నారు. దీన్ని అరికట్టాలి'' అంటూ ప్రియాంక కామెంట్ చేసింది.

  బాలీవుడ్ నుంచీ హాలీవుడ్ వరకూ

  బాలీవుడ్ నుంచీ హాలీవుడ్ వరకూ

  మొత్తానికి ప్రియాంకా హాలీవుడ్ లో అడుగుపెట్తాక ఆమె స్పందించే విషయాలకి ప్రతిస్పందన బాగానే ఉంటోంది. అలాగే ఇప్పుడు ఈ విషయం లో ప్రియాంకా చోప్రా మాటలకు ఆమెమీద ప్రశంసల జల్లు కురుస్తోంది. మొత్తానికి ఒక విశయమైతే క్లియర్ అన్నమాట ఈ లైంగిక వేదిపులు అనే జాఢ్యం, దక్షిణాది సినిమా ఇండస్ట్రీకో, లేదా కేవలం ఇండియాలో మాత్రమే ఉన్న నటీమణులపై జరుగుతున్నదో కాదు. టాలీవుడ్, బాలీవుడ్ నుంచీ హాలీవుడ్ వరకూ, చిన్న ఊరినుంఛీ ప్రపంచం లోని నలుమూలలా ఉండే ప్రధాన నగరాలవరకూ ఈ తరహా వేదింపులు ఉన్నాయి. అందుకే పోరాడాల్సిన భాధ్యత అందరిదీనూ.

  English summary
  ‘Sexual assaults are more an expression of power than sexuality’. Being herself a strong woman, Bollywood Diva Priyanka Chopra says strong women should support other women against sexual assaults.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X