»   » సెక్సియెస్ట్ ఏసియన్ ఉమెన్‌గా ప్రియాంక చోప్రా, లిస్టులో శ్రీదేవి కూడా!

సెక్సియెస్ట్ ఏసియన్ ఉమెన్‌గా ప్రియాంక చోప్రా, లిస్టులో శ్రీదేవి కూడా!

Posted By:
Subscribe to Filmibeat Telugu
సెక్సియెస్ట్ ఏసియన్ ఉమెన్స్ లిస్ట్.. టాప్ లో వున్నది ఎవరో తెలుసా ?

యూకెలో నిర్వహించిన ఓ ఆన్ లైన్ సర్వేలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా సెక్సియెస్ట్ ఏసియన్ ఉమెన్‌గా నిలిచింది. మొత్తం టాప్ 50 సెక్సియెస్ట్ ఉమెన్ జాబితా విడుదల చేయగా ఇందులో ప్రియాంక చోప్రా మొదటి స్థానం దక్కించుకుంది. లండన్ బేస్డ్ వీక్లీ 'ఈస్టర్న్ ఐ' ఈ సర్వే నిర్వహించింది. 2016లో నెం.1 స్థానంలో ఉన్న దీపిక ఈ ఏడాది సర్వేలో 3వ స్థానానికి పడిపోయారు.

 ఇదంతా నా క్రెడిట్ కాదంటున్న ప్రియాంక

ఇదంతా నా క్రెడిట్ కాదంటున్న ప్రియాంక

తనకు సెక్సియెస్ట్ ఉమెన్ గా నెం.1 స్థానం దక్కడంపై ప్రియాంక చోప్రా స్పందిస్తూ... ఈ క్రెడిట్ నాది కాదు, ఈ క్రెడిట్ నా జీన్స్, మీ దృష్టికోణానికే దక్కుతుంది. తనకు ఓటు వేసిన అందరికీ థాంక్స్ అని అన్నారు.

 దీపికను వెనక్కి నెట్టిన నియా శర్మ

దీపికను వెనక్కి నెట్టిన నియా శర్మ

ఇండియన్ టీవీ నటి నియా శర్మ ఈ లిస్టులో రెండో స్థానంలో నిలిచింది. బాలీవుడ్ స్టార్ దీపికను వెనక్కి నెట్టి ఆమె ఈ స్థానం దక్కించుకోవడం విశేషం.

కత్రినాను వెనక్కి నెట్టిన దీపిక, మహీరా

కత్రినాను వెనక్కి నెట్టిన దీపిక, మహీరా

దీపిక పదుకోన్, మహీరా ఖాన్ కత్రినాను వెనక్కి నెట్టారు. దీపిక 3వ స్థానంలో, అలియా భట్ 4వ స్థానంలో, పాకిస్థాన్ నటి మహీరా ఖాన్ 5వ స్థానంలో నిలిచారు. 6వ స్థానంలో ద్రష్టి ధామి, 7వ స్థానంలో కత్రినా, 8వ స్థానంలో శ్రద్ధా కపూర్, 9వ స్థానంలో గౌహర్ ఖాన్, 10వ స్థానంలో రుబీనా దిలైక్ నిలిచారు.

 ఈ లిస్టులో శివంగి జోషి కూడా

ఈ లిస్టులో శివంగి జోషి కూడా

ఈ లిస్టులో మరో కొత్త అమ్మాయికి కూడా చోటు దక్కింది. ‘యే రిష్టా క్యా కెహల్తా హై' అనే సీరియల్ నటి, 19 ఏళ్ల శివంగి జోషికి 16వ స్థానం దక్కింది.

 ఈలిస్టులో చోటు దక్కించుకున్న శ్రీదేవి

ఈలిస్టులో చోటు దక్కించుకున్న శ్రీదేవి

ఈ లిస్టులో ప్రముఖ నటి శ్రీదేవికి 49వ స్థానం దక్కింది. 50 మందితో కూడిన ఈ జాబితాలో అందరి కంటే వయసు ఎక్కువ ఉన్న మహిళ కూడా ఈవిడే. శ్రీదేవి వయసు 54 సంవత్సరాలు.

English summary
Priyanka Chopra has been voted the Sexiest Asian Woman in the world in an annual UK poll released yesterday in London. The 35-year-old Quantico actor topped the 2017 edition of the popular '50 Sexiest Asian Women' poll by London-based weekly newspaper Eastern Eye for a record-breaking fifth time.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu