»   » మై నేమ్ ఈజ్ బండ్ల గణేష్.. మై గాడ్ పవన్ కల్యాణ్

మై నేమ్ ఈజ్ బండ్ల గణేష్.. మై గాడ్ పవన్ కల్యాణ్

Written By:
Subscribe to Filmibeat Telugu

కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో నిర్మాత బండ్ల గణేశ్ తనదైన శైలిలో మాట్లాడి పవన్‌ను, దర్శకుడు త్రివిక్రమ్, టీవీ9 అధినేత రవిప్రకాశ్‌తోపాటు అందర్ని నవ్వుల్లో ముంచెత్తారు. రవి ప్రకాశ్ అంటే నాకు ఇప్పటివరకు ఇష్టం ఉండేది కాదు. ఆయనను ఎప్పుడు కలువలేదు. కానీ తొలిసారి పవన్ గురించి మాట్లాడిన ఆయనను చూస్తే చివరివరకు ఇష్టపడుతాను అని అన్నారు.

Katamarayudu

ఆయన ఏమవుతారో కాలం సమాధానం చెప్తుంది. పవన్ కల్యాణ్ ఎలాంటి వాడంటే ఏమి చెప్పమంటారు. కళ కళ కోసం కాదు. ప్రజల కోసం అన్న బండారు రాఘవ అన్నారు. అలాంటి ఆయన అని చెప్పమంటారా. స్వరాజ్యం నా జన్మ హక్కు దానిని సాధించి తీరుతాను అన్న తిలక్ అని చెప్పమంటాారా. కులం పునాదులపై జాతిని నిర్మించలేమన్న అంబేద్కర్ అని చెప్పమంటారా. అవసరమైతే చినిగిన చొక్కా తొడుక్కో.. మంచి పుస్తకం చదువుకో అని చెప్పిన కందుకూరి వీరేశం పంతులు అని చెప్పమంటారా.

ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి అని చెప్పిన లాలా లజపతి రాయ్ అని చెప్పమంటారా? బ్రిటిష్ వాళ్ల పించన్లు తింటూ బ్రతకడం కంటే వీర సైనికుడిలా మరణిస్తా అని చెప్పిన టిప్పు సుల్తాన్ అని చెప్పమంటారా, బెంగాల్ విభజన బ్రిటీష్ ప్రభుత్వ పతనం అని చెప్పిన మహాత్మగాంధీ అని చెప్పమంటారా, నాకు రక్తాన్ని ఇవ్వండి నేను స్వాతంత్ర్యం తెచ్చి ఇస్తాను అని చెప్పిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని చెప్పమంటారా ఇంక్విలాబ్ జిందాబాద్ అని నినదించిన భగత్ సింగ్ మళ్లీ జన్మించారని చెప్పమంటారా అని ఉద్వేగం ప్రసంగించారు.

English summary
Producer Bandla Ganesh says My name is Bandla Ganesh, My god is Pawan Kalyan
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu