For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Adipurush స్టోరీ లీక్ చేసిన దిల్ రాజు: ప్రభాస్‌తో ఫోన్ సంభాషణను బయటపెట్టి మరీ!

  |

  ఆదిపురుష్.. కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోతోన్న పేరిది. అంతలా ఈ సినిమా విడుదలకు ముందే ప్రభావాన్ని చూపిస్తోంది. దీనికితోడు ఇటీవలే విడుదలైన ఈ మూవీ టీజర్ పెద్ద వివాదానికి కారణం అయింది. ఈ వీడియోలో చూపించిన సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హిందూ సంస్థలు ప్రకటనలను విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఈ సినిమా ఈవెంట్‌లో టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు.. ఆదిపురుష్ మూవీ ట్రోల్స్‌పై ఘాటుగా స్పందించారు. అంతేకాదు, ఆయన ఈ సినిమా స్టోరీని కూడా లీక్ చేశారు. అసలేం జరిగింది? పూర్తి వివరాలేంటో మీరే చూడండి!

  ఆదిపురుష్ టీజర్‌తో కాంట్రవర్శీ

  ఆదిపురుష్ టీజర్‌తో కాంట్రవర్శీ

  ప్రభాస్ - ఓం రౌత్ కాంబోలో రాబోతున్న 'ఆదిపురుష్' నుంచి ఇటీవలే టీజర్ విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో శ్రీరాముడు, హనుమంతుడు, రావణాసురులను చూపించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి. ఇవన్నీ హిందూ మతాన్ని అపహాస్యం చేసేలా ఉన్నాయని అభ్యంతరాలు వస్తున్నాయి. దీంతో సినిమాను నిషేదించాలన్న డిమాండ్లు కూడా వస్తున్నాయి.

  కాజల్ అగర్వాల్ ఎద అందాల ప్రదర్శన: తల్లైన తర్వాత ఫస్ట్ టైం ఇంత ఘాటుగా!

  గ్రాండ్‌గా ఆదిపురుష్ ఈవెంట్

  గ్రాండ్‌గా ఆదిపురుష్ ఈవెంట్

  భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'ఆదిపురుష్' మూవీ యూనిట్ హైదరాబాద్‌లోని ఏఎమ్‌బీ సినిమాస్‌లో 3డీ టీజర్‌ను లాంచ్ చేసింది. ఇందుకోసం చిత్ర యూనిట్ ఓ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించింది. దీనికి ప్రభాస్, ఓం రౌత్‌తో పాటు నిర్మాతలు కూడా హాజరయ్యారు. అలాగే, టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ ఈవెంట్‌కు గెస్టుగా హాజరయ్యారు.

  తడిగుడ్డ వేసుకుని పడుకో అని

  తడిగుడ్డ వేసుకుని పడుకో అని

  'ఆదిపురుష్' ఈవెంట్‌లో దిల్ రాజు మాట్లాడుతూ 'బాహుబలి పార్ట్ 1 షోను శ్రీరాములు థియేటర్‌లో రాత్రి 12 గంటలకు చూశాం. అది అవగానే ప్రభాస్ శివలింగం ఎత్తుకునే ప్లేస్‌లో జండూ‌భామ్‌ను పెట్టి ట్రోలింగ్ చేశారు. కానీ, సినిమా చూసిన వెంటనే నేను ప్రభాస్‌కు ఫోన్ చేసి సూపర్ హిట్. నువ్వు తడిగుడ్డ వేసుకుని పడుకో అని చెప్పా' అంటూ వెల్లడించారు.

  Mrunal Thakur: వ్యభిచార గృహంలో సీతా రామం హీరోయిన్.. రెండు నెలలు నరకం.. ఆ డైరెక్టర్ వల్లేనంటూ!

  ఆదిపురుష్ అలాంటి సినిమానే

  ఆదిపురుష్ అలాంటి సినిమానే

  దిల్ రాజు కంటిన్యూ చేస్తూ.. 'ఆదిపురుష్ లాంటి సినిమాలను ఎక్స్‌పీరియన్స్ చేయాలి. సెల్‌ఫోన్‌లోనో, ఇంకా ఎక్కడో చూసి అంచనా వేయలేము. వీఎఫ్ఎక్స్ సినిమాలు వచ్చినప్పుడు థియేటర్‌లో ఫుల్ క్రౌడ్ మధ్య చూస్తేనే దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయగలం. 'ఆదిపురుష్' కూడా అలాంటి సినిమానే. జనవరి 12న ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది' అని అన్నారు.

  అప్పటికప్పుడే మారిపోయింది

  అప్పటికప్పుడే మారిపోయింది

  టీజర్ గురించి ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ.. 'ఆదిపురుష్ టీజర్‌ను మొదట ఫోన్‌లో చూశా. తర్వాత ఇంటికెళ్లి 65 ఇంచుల టీవీ చూశాను. అదే ఫీలింగ్ కలిగింది. ఈరోజు థియేటర్‌కు వచ్చి 3డీలో చూశాను. ఇంకా ఎక్కువ థ్రిల్ ఫీలయ్యాను. విజువల్స్ వచ్చి మీద పడుతుంటే విజిల్స్ వేశా. ఆదిపురుష్ అలా ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిన సినిమా' అంటూ చెప్పుకొచ్చారు.

  ఒంటిపై నూలుపోగు లేకుండా హీరోయిన్: సీక్రెట్ పార్ట్ కనిపించేలా ఘోరంగా!

  డైరెక్టర్‌కు ఫ్యాన్స్‌ను అయ్యా

  డైరెక్టర్‌కు ఫ్యాన్స్‌ను అయ్యా

  'ఆదిపురుష్' ఈవెంట్‌లో దిల్ రాజు మాట్లాడుతూ.. 'నాకు మొదట ఓం రౌత్ అంటే ఎవరో తెలీదు. ఆయన ప్రభాస్‌తో సినిమా చేస్తున్నాడని తెలిసి 'తానాజీ' మూవీ చూశాను. అది చూసిన తర్వాత ఓం రౌత్‌కు పెద్ద ఫ్యాన్ అయిపోయా. ఇక, ఆయన ప్రభాస్ లాంటి స్టార్‌తో ఎలాంటి సినిమా చేస్తారో అర్థం చేసుకోగలను. జనవరి 12న అది మీకే తెలుస్తుంది' అని పేర్కొన్నారు.

  సినిమా స్టోరీని లీక్ చేసేశారు

  సినిమా స్టోరీని లీక్ చేసేశారు

  ఇదే ఈవెంట్‌లో దిల్ రాజు 'రామాయణంలోని ఒక ఎపిసోడ్‌ను తీసుకొని నేటి ప్రేక్షకులకు కొత్తగా చూపించాలని ప్రయత్నిస్తున్నారు. దీనిపై కూడా చాలా చర్చ జరుగుతుంది. రావణుడు ఇలా ఉంటాడా? రావణుడు పక్షి మీద ఎందుకొస్తాడు? పూల రథం మీద రావాలి కదా అని ట్రోల్ చేస్తున్నారు. నేటి ప్రేక్షకులకు ఏం చూపించాలి అని వాళ్లొక ప్రయోగం చేశారు' అని లీక్ చేసేశారు.

  English summary
  Rebel Star Prabhas Now Doing Adipurush Movie Under Om Raut Direction. Now Producer Dil Raju Reveals This Movie Main Storyline.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X