twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘పేట’ నిర్మాతకు దిల్ రాజు కౌంటర్: పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు, నా డబ్బు కూడా చాలా పోయింది!

    |

    Recommended Video

    Dil Raju vs Peta Producer : Dil Raju Clarified that No Theaters To Tamil Movies | Filmibeat Telugu

    రజనీకాంత్ 'పేట' చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్న నిర్మాత వల్లభనేని అశోక్... ఆదివారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంటులో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దిల్ రాజు, అల్లు అరవింద్, యూవి క్రియేషన్స్ వారు థియేటర్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని విమర్శించడంతో పాటు.... కుక్కలు, షూట్ చేయాలి, థియేటర్ మాఫియా అనే అభ్యంతరకర పదాలు వాడుతూ ఆగ్రహంగా మాట్లాడారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం జరిగిన ఎఫ్ 2 ట్రైలర్ రిలీజ్ ఈవెంటులో దిల్ రాజు స్పందించారు.

    వారు అలా మాట్లాడటం సరికాదు...

    వారు అలా మాట్లాడటం సరికాదు...

    సినిమా అనౌన్స్‌మెంట్స్ దగ్గర నుంచి రిలీజ్ డేట్స్ వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో మాతో పాటు మీడియా వారికి అన్నీ తెలుస్తాయి. నిన్న ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటులో వారు తొందరపడి స్టేట్మెంట్ ఇచ్చారో ఏంటో తెలియదు. వారు చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదు అని దిల్ రాజు తెలిపారు.

    ఈ పరిస్థితుల్లో పక్క రాష్ట్రం సినిమాకు థియేటర్లు ఎలా ఇస్తాం?

    ఈ పరిస్థితుల్లో పక్క రాష్ట్రం సినిమాకు థియేటర్లు ఎలా ఇస్తాం?

    ఎన్టీఆర్ బయోపిక్, వినయ విధేయ రామ, ఎఫ్2...ఈ మూడు తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన భారీ బడ్జెట్, ప్రతిష్టాత్మక చిత్రాలు. ఆరు నెలల క్రితమే వీటి రిలీజ్ డేట్స్ అనౌన్స్ అయ్యాయి. ఈ సినిమాలకే థియేటర్లు ఎలా సెట్ చేసుకోవాలో అని ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్లు చాలా స్ట్రగుల్ అయ్యాం. నెల రోజుల క్రితం తమిళ సినిమా(పేట)ను కొనుగోలు చేసి సంక్రాంతి రిలీజ్ అని అనౌన్స్ చేశారు. మూడు తెలుగు సినిమాలు ఉన్నపుడు పక్కరాష్ట్రం నుంచి వచ్చే సినిమాకు థియేటర్లు ఎలా అడ్జెస్ట్ అవుతాయి? అని దిల్ రాజు ప్రశ్నించారు.

    అప్పుడు కావాల్సినన్ని థియేటర్లు ఇచ్చాం

    అప్పుడు కావాల్సినన్ని థియేటర్లు ఇచ్చాం

    అదే నిర్మాత గడిచిన నాలుగు నెలల్లో మూడు డబ్బింగ్ సినిమాలు అనౌన్స్ చేశారు. నవాబ్, సర్కార్, పేట... సర్కార్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని థియేటర్లు కావాలో అన్ని థియేటర్లలో వేసుకున్నారు. అపుడు వేసుకున్న వారికి ఇపుడు దొరకడం లేదని అనవసరమైన స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. తెలుగు సినిమాలను తగ్గించుకుని ఆ సినిమాకు థియేటర్లు ఇవ్వలేం. ఈ సీజన్లో మన తెలుగు సినిమాకు తప్ప వేరే సినిమాలకు థియేటర్లు ఇచ్చే పరిస్థితి లేదని దిల్ రాజు స్పష్టం చేశారు.

    అప్పుడే రిలీజ్ చేసుకోవచ్చుకదా...

    అప్పుడే రిలీజ్ చేసుకోవచ్చుకదా...

    ‘పేట' 18 నుంచి అన్ని థియేటర్లలో పడతాయని వారే చెప్పారు... మరి 18వ తేదీనే తెలుగులో రిలీజ్ చేసుకోవచ్చుకదా. అపుడు రిలీజ్ చేస్తే రెండు రాస్ట్రాల్లో థియేటర్లు దొరుకుతాయి కదా. ఇలాంటివి ఆలోచించకుండా కాంట్రవర్సల్ సేట్మెంట్స్ ఇవ్వడం సరికాదు.

    పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు..నేనూ అనగలను, కానీ నాకొక క్యారెక్టర్ ఉంది

    పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు..నేనూ అనగలను, కానీ నాకొక క్యారెక్టర్ ఉంది

    వారు టంగ్ స్లిప్ అయి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారు. మేము కూడా మాట్లాడగలం. కానీ నాకొక క్యారెక్టర్ ఉంది. ఇక్కడ మనం చేస్తుంది వ్యాపారం. ఆయన సినిమా కొనుగోలు చేసింది కూడా వ్యాపారం కోసమే. మేము మంచి సినిమాలు చేసేది కూడా ప్రేక్షకుల దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకోవడానికే... అని దిల్ రాజు వ్యాఖ్యానించారు.

    నాకు చాలా డబ్బులు పోయాయి

    నాకు చాలా డబ్బులు పోయాయి

    గడిచిన సంవత్సరంలో డిస్ట్రిబ్యూషన్లో నాకు చాలా డబ్బులు పోయాయి. అయినా సినిమా మీద ఉన్న పాషన్‌తో నా సొంత ప్రొడక్షన్లో తెలుగు సినిమాలు తీస్తున్నాం. ఉన్న మూడు సినిమాలకు థియేటర్లు అడ్జెస్ట్ చేసుకోలేక చాలా విషయాల్లో కాంప్రమైజ్ అవుతూ అండర్ స్టాండింగుతో వెళుతున్నాం. ఇది రైటా? రాంగా? మీడియా వారే అర్థం చేసుకోవాలి... అని దిల్ రాజు అన్నారు.

    English summary
    Producer Dil Raju Speech at F2 Movie Trailer Launch. F2 – Fun and Frustration 2019 Telugu language comedy film, produced by Dil Raju on Sri Venkateswara Creations banner and directed by Anil Ravipudi. Starring Venkatesh, Varun Tej, Tamannaah Bhatia, Mehreen Pirzada in the lead roles and music composed by Devi Sri Prasad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X