twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అలాంటి సినిమాను కాపీ కొడుతామా?, ఏంటిదంతా?: 'నా పేరు సూర్య' నిర్మాత..

    |

    మనవాళ్లకు హాలీవుడ్ నుంచి కథల్ని ఎత్తుకొచ్చేయడం బాగా అలవాటైపోయిందన్న విమర్శ ఈమధ్య కాలంలో బాగా వినిపిస్తోంది. అదే సమయంలో.. ఏదో ఒక చిన్న పోలిక దొరికినంత మాత్రానా 'కాపీ' అనేస్తారా? అని అటు ఇండస్ట్రీ నుంచి కూడా గట్టి బదులు వస్తోంది. తాజాగా 'నా పేరు సూర్య' మరో హాలీవుడ్ కాపీ అంటూ వస్తున్న విమర్శలపై నిర్మాత లగడపాటి శ్రీధర్ స్పందించారు..

    Recommended Video

    'నా పేరు సూర్య' ఆ సినిమా కు కాపీ నా ?
     కాపీ కాదు: లగడపాటి శ్రీధర్

    కాపీ కాదు: లగడపాటి శ్రీధర్

    'నా పేరు సూర్య' హాలీవుడ్ లో వచ్చిన 'ఆంట్వోన్ ఫిషర్' సినిమాకు కాపీ అన్న ప్రచారాన్ని నిర్మాత శ్రీధర్ ఖండించారు. తమ సినిమా ఏ సినిమాకు రీమేక్ లేదా ఫ్రీమేక్ కాదని తేల్చి చెప్పారు.

     ఆ మాత్రానికే కాపీ అయిపోతుందా?:

    ఆ మాత్రానికే కాపీ అయిపోతుందా?:

    'నా పేరు సూర్య'పై ఇలాంటి ప్రచారం ఎందుకు మొదలైందో తనకు అర్థం కావడం లేదన్నారు శ్రీధర్. తమ సినిమాలో హీరో ఆర్మీకి చెందినవాడు, యాంగర్ మేనేజ్ మెంట్ సమస్యను ఎదుర్కొంటాడని చూపించినంత మాత్రానా.. హాలీవుడ్ సినిమాకు కాపీ అయిపోతుందా? అని ప్రశ్నించారు.

     అలాంటి సినిమాను కాపీ కొడుతామా?:

    అలాంటి సినిమాను కాపీ కొడుతామా?:

    ఆంట్వోన్ ఫిషర్ సినిమాను తాను కూడా చూశానని, కమర్షియల్‌గా అక్కడ అది పెద్ద ఫ్లాప్ అని తెలిపారు. అలాంటి ఫ్లాప్ సినిమాను స్ఫూర్తిగా తీసుకుని ఎవరైనా సినిమా చేయాలనుకుంటారా? అని శ్రీధర్ ప్రశ్నించారు. తమ సినిమాపై జరుగుతున్న కాపీ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదన్నారు.

    త్రివిక్రమ్ ఎఫెక్ట్:

    త్రివిక్రమ్ ఎఫెక్ట్:

    ఇటీవలి కాలంలో త్రివిక్రమ్ 'అజ్ఞాతవాసి' సినిమా ఎఫెక్ట్ టాలీవుడ్ పై గట్టిగానే పడింది. అజ్ఞాతవాసి ఫ్రెంచ్ సినిమా లార్గో వించ్ కు కాపీ అని నిర్దారణ అయిపోవడంతో.. తెలుగు దర్శకుల సినిమాలంటేనే కాస్త అనుమానంగా చూసే పరిస్థితి వచ్చింది. ఈ ఎఫెక్టే ఇప్పుడు అల్లు అర్జున్ 'నా పేరు సూర్య'ను కూడా వెంటాడుతోంది.

    అలర్ట్ అయ్యారు..:

    అలర్ట్ అయ్యారు..:

    'అజ్ఞాతవాసి' సినిమాకు ఏకంగా ఫ్రెంచ్ డైరెక్టర్ నుంచే హెచ్చరికలు జారీ అవడంతో టాలీవుడ్ ఒక్కసారిగా అప్రమత్తమైంది. హాలీవుడ్ కథల్ని ఎత్తుకొచ్చేస్తే చిక్కుల్లో పడక తప్పదన్న విషయం అర్థమైంది. అందుకే చాలామంది దర్శకులు కథల విషయంలో జాగ్రత్తపడుతున్నారు. కథలను సొంతంగా రాసుకోవడం కంటే.. రచయితలతోనే కథలు రాయించడం మంచిదని మరికొంతమంది దర్శకులు భావిస్తున్నారు.

    English summary
    Producer Lagadapati Sridhar was in shock after hearing copy rumours on Naa Peru Surya. He denied copy allegations on the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X