»   » తమ్ముడూ నిన్ను మిస్ అవుతున్నాం.... రామ్ చరణ్ కోసం చిరు కూతురి ట్వీట్

తమ్ముడూ నిన్ను మిస్ అవుతున్నాం.... రామ్ చరణ్ కోసం చిరు కూతురి ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న 'ఖైదీ నెం. 150' తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడొక హాట్‌టాపిక్ అన్నది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. చాలాకాలం తర్వాత చిరు రీ ఎంట్రీ ఇస్తూ ఉండడం, ఆయనికిది 150వ సినిమా కావడం.. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో 'ఖైదీ నెం. 150' తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా భావించిన చిరు తనయుడు రామ్ చరణ్ కూడా తానే స్వయంగా నిర్మిస్తూ, అన్నీ దగ్గరుండి చూసుకుంటూ వస్తున్నారు. ఇక ఇప్పటివరకూ ఖైదీ ప్రతి షెడ్యూల్‌లో వీలైనంతవరకూ పాల్గొంటూ వస్తోన్న చరణ్, యూరప్‌లో జరుగుతోన్న తాజా షెడ్యూల్‌కు మాత్రం వెళ్ళలేకపోయారు.'ఖైదీ నెంబర్ 150' సినిమా షూటింగ్ విదేశాల్లో జరుగుతోంది. ప్రస్తుతం 'క్రోటియా'లో చిరంజీవి - కాజల్ కాంబినేషన్లో అక్కడ ఒక పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ కి చరణ్ రాకపోవడంతో, ఆయనని మిస్ అయినందుకు టీమ్ ఫీలవుతోంది.

చిరంజీవి సినిమా మొదలైన దగ్గర నుంచి, ప్రతి షెడ్యూల్ కి చరణ్ వచ్చాడు. అన్ని విషయాలను దగ్గరుండి చూసుకుంటూ, యూనిట్ లో ఉత్సాహాన్ని నింపాడు. షూటింగులో ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చూశాడు. అలాంటి చరణ్ 'ధ్రువ' సినిమా పనుల వలన,'ఖైదీ' యూరప్ షెడ్యూల్ కి వెళ్లలేకపోయాడు. దాంతో చరణ్ రాని వెలితి తెలుస్తుందంటూ, ఆయన సోదరి సుస్మిత చెప్పింది. ఇక ప్రస్తుతం చిత్రీకరిస్తోన్న పాట చాలా బాగా వస్తోందంటూ ఆనందాన్ని వ్యక్తం చేసింది.ప్రస్థుతం చిరంజీవి తన 'ఖైదీ నెంబర్ 150' షూటింగ్ కోసం కాజల్ తో రొమాన్స్ చేస్తూ యూరప్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

Producer missing in KhaidiNo.150

అయితే ఈసినిమా నిర్మాతగా నిర్మాణ వ్యవహారాలు చూడవలసిన రామ్ చరణ్ ఇప్పుడు 'ధృవ' మూవీ షూటింగ్ లో థాయిలాండ్ వెళ్ళి రకుల్ ప్రీత్ తో రొమాన్స్ చేస్తున్నాడు.యూరప్ లోని స్లొవేనియాలో ఉన్న 'ఖైదీ నెంబర్ 150' షూటింగ్ వ్యవహారాలను చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత ప్రస్తుతం నిర్వహిస్తోంది. అయితే ఇంత బిజీలో కూడ సుస్మిత ఒక ఫోటోను ట్విట్ చేసి మెగా అభిమానులకు షేర్ చేసింది.ఆ ఫోటోలో ప్రొడ్యూసర్ అని పెద్దపెద్ద అక్షరాలతో ఉన్న కుర్చీ కనిపిస్తోంది.

Producer missing in KhaidiNo.150

"చరణ్.. నువ్వు ధృవ సాంగ్ షూటింగ్ లో బిజీగా ఉన్నావని మాకు తెలుసు. కానీ స్లోవేనియాలో ఖైదీ నెంబర్ 150 షూటింగ్ లోఉన్న మేము.. 150వ సినిమా నిర్మాతగా నిన్ను మిస్ అవుతున్నాం" అంటూ ట్వీట్ చేసింది సుశ్మిత. ఖైదీ నెంబర్ 150' లో చిరంజీవితో పాటు ప్రధాన నటులకు కాస్ట్యూమ్ డిజైనర్ బాధ్యతలను సుశ్మిత నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ బాధ్యతలతో పాటుగా యూరప్ లో చరణ్ తరపున నిర్మాణ బాధ్యతలు కూడ నిర్వహిస్తూ ప్రస్తుతం సుస్మిత చాల బిజీగా ఉంది. చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150' లుక్ విషయంలో సుస్మిత తీసుకున్న జాగ్రత్తలతో చిరంజీవి తన వయసుకు 10 సంవత్సరాల చిన్న వాడుగా కనిపిస్తున్నాడు అన్న కామెంట్స్ ఇప్పటికే వచ్చాయి. ఆరు పదుల వయసు దాటిన చిరంజీవి కాజల్ లక్ష్మీరాయ్ లను ఖంగారు పెడుతూ స్టెప్పులు వేస్తున్నాడు అంటే చిరంజీవి తన మెగా అభిమానుల కోసం ఎంత హోమ్ వర్క్ చేసాడో అర్ధం అవుతోంది..

English summary
Susmitha tweeted "Charan, we know you're busy shooting your #Dhruva song. But we,KonidelaPro miss you here in Slovenia #RamCharan #150thproducer"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu