twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాయ్‌లెట్లు కడిగి పైకి వచ్చా.. బండ్ల గణేష్ తన గోతిని తానే తవ్వుకొన్నాడు.. ఎన్టీఆర్ కారణంగా.. పీవీపీ

    |

    నిర్మాత, రాజకీయ వేత్త, పారిశ్రామిక వేత్త పొట్లూరి వీ ప్రసాద్ (పీవీపీ) ప్రతీ రంగంలో తన మార్కు చూపించడంలో ప్రత్యేకమైన శైలి. పలు రంగాల్లో రాణిస్తున్న పీవీపీ తాజాగా ఓ ప్రైవేట్ టెలివిజన్ ఛానెల్‌కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ సందర్భంగా తన జీవితంలో అట్టడుగు విషయాలు.. ఉన్నత శిఖరాలను అధిరోహించిన తీరును ప్రస్తావించారు. ఏ విధంగా కష్టపడి పైకి వచ్చాననే విషయాన్ని వివరించారు. అలాగే బండ్ల గణేష్‌తో వివాదంపై కూడా స్పందించారు.

     విదేశాలకు వెళ్లాలని కసి

    విదేశాలకు వెళ్లాలని కసి

    విజయవాడలో మాది చాలా మధ్య తరగతి కుటుంబం. 90వ దశకంలోనే విదేశాలకు వెళ్లాలనే కోరిక ఉండేది. నాకు అలా ఆస్ట్రేలియాకు వెళ్లే అవకాశం వచ్చింది. ఇంజినీరింగ్ చదివేటనప్పుడే వ్యాపారం చేస్తానంటే.. నా సహ విద్యార్థులు నవ్వుకొనే వారు. ప్రపంచాన్ని చూడాలనే కోరిక, కసి నాలో ఉండేది. అదే నన్ను పలు దేశాల్లో తిరిగే అవకాశం కల్పింది. మా ఇంట్లో ఎవరు అభ్యంతరం చెప్పలేదు. యుక్త వయసు నుంచి నేను స్వతంత్ర్యంగా బతికే ఆలోచనతో ముందుకెళ్లాను అని పీవీపీ వెల్లడించారు.

    ఆస్ట్రేలియాలో టాయెలెట్లు కడిగి

    ఆస్ట్రేలియాలో టాయెలెట్లు కడిగి

    1994లో ఆస్ట్రేలియాలో నేను తొలి ఉద్యోగం చేశాను. నాకు ఆఫర్ లేటర్ రావడంతో ఉద్యోగం అనుకొని ఇన్ షర్ట్ చేసుకొని వెళితే.. మహిళల టాయెలెట్లు కడిగే ఉద్యోగం ఇచ్చారు. 13 ఫోర్ల నుంచి కింది వరకు టాయెలెట్స్ క్లీన్ చేశాను. తొలి రోజు నాకు 6 గంటలకుపైగానే పట్టింది. పనిలోనుంచి తీసేస్తాని చెప్పారు. బతిమిలాడుకొని నేను ఆ ఉద్యోగాన్ని కొనసాగించాను. ఈ విషయాన్ని నా పిల్లలకు ఇప్పటికీ చెబుతాను. ఆ సమయంలో వాడిన టీషర్లులు నా ఇంట్లో ఉన్నాయి అని పీవీపీ చెప్పారు.

     బండ్ల గణేష్ రుణం ఇచ్చి...

    బండ్ల గణేష్ రుణం ఇచ్చి...

    నిర్మాత బండ్ల గణేష్‌తో వివాదంపై పీవీపీ స్పందించారు. టెంపర్ సినిమా కోసం సుమారు 30 కోట్లు ఇచ్చాం. ఎన్టీఆర్ ఇచ్చిన హామీ మేరకు డబ్బులు ఇవ్వకుండానే సినిమాను రిలీజ్‌కు ఒప్పుకొన్నాం. ఆ తర్వాత డబ్బు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నారు. ఓ రోజు హోటల్‌లో కలిసి నాతో తిమ్మిరి తిమ్మిరిగా మాట్లాడారు. నాతో పెట్టుకొంటే గెలువు అన్న అంటూ.. మాటలు వదిలారుు. దాంతో నాకు ఆయనకు మధ్య వివాదం పెరిగింది.

    తన గోతిని తానే తవ్వుకొని..

    తన గోతిని తానే తవ్వుకొని..

    ఎవరైనా బాకీ ఉన్నప్పుడు డబ్బులు కట్టాల్సిందే. ఆయన కాకపోతే అతడి మనవడి వద్ద నుంచి రాబడుతాను. ట్వీట్లు చేస్తే బాకీ రద్దు అయిపోతుందా? ముక్కు పిండి వసూలు చేస్తాను. అనవసరమైన పనుల చేసి ఆయన గోతిని ఆయనే తవ్వుకొన్నాడు. ఇక చట్టం పని చట్టం చేసుకొని వెళ్తుంది అని పీవీపీ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఈ మధ్య పీవీపీ చేసిన ఫిర్యాదుతో నిర్మాత బండ్ల గణేష్‌ను రిమాండ్‌పై జైలుకు తరలించిన సంగతి తెలిసిందే.

    English summary
    Producer PVP commented on Bandla Ganesh Arrest and Temper movie finance contraversy. Recently, Bandla Ganesh arrested on cheque bounce case.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X