»   » ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ కన్నుమూత

ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ కన్నుమూత

Posted By:
Subscribe to Filmibeat Telugu
Vadde Ramesh
హైదరాబాద్: ప్రముఖ తెలుగు సినీ నిర్మాత, విజయమాధవి పిక్చర్స్ బేనర్ అధినేత వడ్డే రమేష్(65) బుధవారం కన్నుమూసారు. గత కొంత కాలంగా బోన్ క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్న ఆయన హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. రమేష్ మృతితో తెలుగు సినిమా పరిశ్రమలో విషాదం నెలకొంది.

వడ్డే రమేష్ ఇప్పటి వరకు పలువురు ప్రముఖ హీరోలతో సినిమాలు తీసారు. ఎన్టీఆర్‌తో బొబ్బిలి పులి, కృష్ణం రాజుతో కటకటాల రుద్రయ్య లాంటి హిట్స్ ఇచ్చారు. చిరంజీవితో లంకేశ్వరుడు చిత్రాన్ని నిర్మించారు. కృష్ణా జిల్లా యలమర్రు గ్రామానికి చెందిన వడ్డే రమేష్ కుటుంబం బెజవాడలో సెలైంది. ఆయన తనయుడు వడ్డే నవీన్ కూడా పలు చిత్రాల్లో హీరోగా పని చేసారు.

వడ్డే రమేష్ తొలి సినిమా దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన 'పాడవోయి భారతీయుడా'. ఈ చిత్రం ద్వారా శ్రీదేవి హీరోయిన్‌గా పరిచయం చేసారు. శ్రీదేవికి మొదట హీరోయిన్ చాన్స్ ఇచ్చింది వేరే అయినప్పటికీ తొలుత విడుదలైంది మాత్రం ఇదే. అయితే ఈచిత్రం బాక్సాఫీసు వద్ద నష్టాలను మిగిల్చింది.

వీటితో పాటు పెళ్లానికి ప్రేమలేఖ-ప్రియురాలికి శుభలేఖ, విశ్వనాథ నాయకుడు, పండంటి కాపురం లాంటి చిత్రాలను నిర్మించారు. పండండి కాపురం చిత్రాన్ని హిందీలో 'సుర్ హరా సంసార్' పేరుతో అనువదించారు. అమ్మకొడుకు అనే చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు వడ్డే రమేష్.

English summary
Producer Vadde Ramesh passed away today. Producer of Bobbilipuli, Lankeshwarudu, Katakatala Rudrayya, Vishwanatha Nayakdu, Rangoon Rowdy. His son Vadde Naveen is popular actor. Vadde Ramesh died of cancer. He also produced films in Hindi and Tamil.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu