twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దేశభక్తి కథాంశంతో 'పంజా'

    By Srikanya
    |

    ఇప్పుడు ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'పంజా'టాపిక్కే. ఇక ఈ చిత్రం ఏ కధాంశంతో తీసారు...ఏంటి ఇందులో హైలెట్ అంటే ..దేశభక్తి తో నడిచే కథ అంటున్నారు నిర్మాతలు. మీడియాతో మాట్లాడుతూ..'పంజా' చిత్రం కథ పవన్‌కళ్యాణ్‌కు సరిపోయే కథ అనీ, ఎప్పటినుంచో ఇలాంటి కథాంశంతో చేయాలని ఎదురుచూశామనీ, అంతర్లీనంగా దేశభక్తి ప్రభోదించే అంశాలున్నాయనీ, ఇలాంటి చిత్రాన్ని తీయటం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. అలాగే పవన్‌ కళ్యాణ్‌, విష్ణువర్ధన్‌తో కలిసి మా దగ్గరకు వచ్చారు. దర్శకుని వద్ద మంచి కథ ఉంది. ఆ కథ పవన్‌కు బాగా నచ్చింది. ఇప్పటిట్రెండ్‌కు సరిపడే కథాంశం. 'పంజా' అనే టైటిల్‌ కథలో పవన్‌ పాత్రకు సరిపోయేట్లుగా ఉంటుంది.

    'చురచురచూసే చూపు... అతని ప్రవర్తన, అతనిలో ఫైర్‌' కలిపి ఈ టైటిల్‌కు సరిపోతాయి. ఈ చిత్ర కథ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. గ్యాంగ్‌లో పవన్‌ మెంబర్‌. అంతర్లీనంగా దేశభక్తి అంశం కూడా ఉంటుంది. పాత్ర పేరు జయదేవ్‌ షాట్‌కట్‌లో 'జై' అంటారు. ప్రతినాయకులు జాకీష్రాఫ్‌, అడవి శేషు. ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే జనాదరణ పొందాయి. పాపారాయుడు పాట చాలా ఫేమస్‌ అయింది. చిత్ర రీరికార్డింగ్‌ హైలైట్‌గా నిలుస్తుంది అన్నారు. ఇక తమిళంలోకూడా ఈ చిత్రం విడుదలవుతుంది. నెల తర్వాత డబ్బింగ్‌ చేస్తాం. 'కురి' అనే టైటిల్‌ నిర్ణయించాం అన్నారు. బుధవారం సెన్సార్‌ పూర్తిచేసుకున్న ఈ చిత్రం 9న విడుదలకు సిద్ధమవుతోంది.

    English summary
    Panja movie starring Pawan Kalyan is releasing on 9th December.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X