»   »  మహేష్ తో పోటీ గురించి సైతం పవన్ చెప్పారు (వీడియో)

మహేష్ తో పోటీ గురించి సైతం పవన్ చెప్పారు (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ కు ,మహేష్ తో విరోధం ఉందా... ఈ ప్రశ్నను తాను ఇంటర్వూలో అడిగానంటున్నారు రాజీవ్ మసంద్. సిఎన్ ఎన్ ఐబిఎన్ కోసం ఆయన తాజాగా పవన్ తో ఇంటర్వూ చేసారు. ఆ ఇంటర్వూ ఈ రోజు సాయింత్రం ఆరు గంటలకు ప్రసారం కానుంది. ఈ సందర్బంగా ఆయన ప్రోమోలాంటి వీడియోని పంచుకుంటూ ఈ మాటలు ట్వీట్ చేసారు.

పవన్ తన చిత్రం హిందీలో కూడా రిలీజు అవుతూండటంతో ప్రమోషన్ లో భాగంగా.. బాలీవుడ్‌ మీడియాకు మాత్రమే ఇంటర్యూలు ఇస్తున్నారు. తాజాగా బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ రాజీవ్ మసంద్ పవన్‌ని ఇంటర్వ్యూ చేయగా, వారితో దిగిన ఫోటోలు కొన్ని బయటకు వచ్చాయి. ఇందులో పవన్ మీసం, గడ్డం లేకుండా సాఫ్ట్ లుక్‌లో కనిపించారు. ఈ ఇంటర్వూ సిఎన్ ఎన్ ఐబిన్ టీవి ఛానెల్ లో 7 వ తేదీ అంటే ఈ రోజు ప్రసారం అవుతుంది.

ఈ ఇంటర్వ్యూ కోసం తీయించుకున్న ఫోటోను రాజీవ్ మసంద్ తన ట్విటర్ లో పెట్టి పవన్ ఇప్పటి వరకు ఎవరికీ చెప్పని అనేక విషయాలు తన ఇంటర్వ్యూలో చెప్పాడు అంటూ ఈరోజు ప్రసారం కాబోతున్న ఆ ఇంటర్వ్యూ పై కూడ అంచనాలు పెంచేసాడు.

ఇక ఈ ఇంటర్వూ పవన్ ..ఫామ్ హౌస్ లోనే జరిగింది. ఈ ఇంటర్వూ అనంతరం రాజీవ్ మసంద్.. గతంలో అనుపమ చోప్రా అన్నట్లుగానే ..ఆయన గ్రేస్, హ్యూమిలిటీ, జ్ఞానానికి తల వంచుతున్నానంటూ రాసుకొచ్చారు.

English summary
Rajeev Masand tweeted: PowerStar PawanKalyan on films, politics, rivalry with MaheshBabu & making a difference: 6.30pm today CNN-IBN
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu