twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    2002 నాటి సల్మాన్‌ఖాన్‌ కేసు.. మళ్లీ విచారణ

    By Srikanya
    |

    ముంబయి: బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వ్యక్తులపైనుంచి కారు పోనిచ్చిన కేసులో తాజాగా మళ్లీ విచారణ చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. ఈ కేసులో 64 మంది సాక్షులను విచారించాలంటూ వారి జాబితాను విచారణాధికారులు కోర్టుకు అందజేశారు. అనంతరం సెషన్స్‌ కోర్టు జడ్జి కేసును ఫిబ్రవరి 12కు వాయిదా వేశారు. అదే సమయంలో ఈ కేసుకు సంబంధించి అదనపు పత్రాలు ఏమైనా ఉంటే సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశించారు.

    శిక్షార్హమైన హత్యానేరం కోణంలో సాక్షులను గతంలో విచారించని కారణంగా ఈ కేసును తాజాగా మరోసారి విచారించాలంటూ డిసెంబరు 5న కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే మళ్లీ సాక్షులను విచారించాలని నిర్ణయించారు. 2002లో తన టయోటా కారులో వెళుతూ బాంద్రా సమీపంలో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వ్యక్తులపైనుంచి పోనిచ్చారు. ఈ ఘటనలో ఒకరు మరణించగా, నలుగురు గాయపడ్డారు.

    సల్మాన్ ఖాన్ 'జైహో' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. జనవరి 24, 2014లో ఈచిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం ప్రీమియర్ షోకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు సల్మాన్. జనవరి 23 ముంబైలో ఈ చిత్రం ప్రీమియర్ షో జరుగనుంది.

    ఈ చిత్రం తెలుగులో మెగాస్టార్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన 'స్టాలిన్' చిత్రానికి జిరాక్స్ కాపీ. స్టాలిన్ చిత్రాన్ని ఉన్నదున్నట్లు సల్మాన్ హీరోగా 'జైహో' పేరుతో హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సల్మాన్ సోదరుడు సొహైల్ ఖాన్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. తొలుత ఈచిత్రానికి మెంటల్ అనే టైటిల్ పెట్టాలనుకున్నారు. సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్ సూచన మేరకు 'జైహో'గా మార్చారు.

    English summary
    The decks were cleared on Tuesday for the commencement of fresh trial against Bollywood actor Salman Khan in the 2002 hit-and-run case with the prosecution giving to the court a list of 64 witnesses they propose to examine. Salman is facing the charge of running over his Toyota Land Cruiser on a group of persons sleeping on a footpath outside a bakery in suburban Bandra in September 2002, killing one and injuring four others.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X