twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పావలా కల్యాణ్ అంటే నోరుమెదపలే.. ఇండస్ట్రీలో కులపిచ్చి.. మేకప్ వేసి పంపించారు.. ఫృథ్వీ ఫైర్

    |

    Recommended Video

    Prithviraj Sensational Comments On Caste Feeling In Tollywood

    నటుడు, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, వైసీపీ నేత, ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ తాజాగా టాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కులాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఎస్వీబీసీ చైర్మన్ పదవి చేపట్టిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. రకరకాల అంశాలను ప్రస్తావించారు. చిరంజీవితో అనుబంధం, పవన్ కల్యాణ్‌తో సిద్దాంత పరమైన విభేదాలను బహిరంగంగా ప్రస్తావించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..

    పరిశ్రమలో కులపిచ్చి

    పరిశ్రమలో కులపిచ్చి

    థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ తెలుగు సినిమా ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. పరిశ్రమలో కులపిచ్చి ఎక్కువ. మొదటి నుంచి ఇది కొనసాగుతూనే ఉంది. మా వాడివేనా అంటూ అడిగే వారు. అలాంటి పరిస్థితుల్లో దివంగత నటుడు శ్రీహరి ఓ సలహా ఇచ్చారు. కుల ప్రస్తావన తెస్తే తల ఊపు.. దానికి అదే పరిష్కారమని చెప్పారు. నీ పేరుకు రాజు అని తగిలించుకొ అంటే.. దాంతో ఫృథ్వీరాజ్ అని పేరు మార్చుకొన్నాను అని ఫృథ్వీ ఓ ప్రైవేట్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

    కృష్ణంరాజు మోసపోయారు

    కృష్ణంరాజు మోసపోయారు

    ఫృథ్వీ రాజు అనే పేరు చూసి హీరో, రెబల్ స్టార్ కృష్ణంరాజు కూడా మోసపోయారు. తను కూడా రాజుల కులం అనుకొన్నారు. ఇప్పటికి నా పేరు చూసి మోసపోయానని సరదాగా ఆయన చెబుతుంటారు. కొన్నిసార్లు కులం వల్ల ఇబ్బంది పట్టాను. మేకప్ వేసిన తర్వాత కూడా షూటింగ్‌ నుంచి బయటకు పంపించారని పృథ్వీ పేర్కొన్నారు.

    వేషాలు కరువా?

    వేషాలు కరువా?

    ఫృథ్వీరాజ్‌కు వేషాలు తక్కువైనట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. కొన్ని ప్రొడక్షన్లు నన్ను బ్యాన్ చేశారంటూ వచ్చిన వార్తలపై ఆయన తీవ్రంగా స్పందించారు. నాకు వేషాలు వారు ఉన్నారు.. మెగా బ్యానర్‌లో చోటు లేదంటే ఒప్పుకోను. సైరాలో నాకు వేషం ఇవ్వలేదా? చిరంజీవి చాలా మంచి వ్యక్తి. మితభాషి అని ఫృథ్వీ అన్నారు.

    చౌదరీ అని పేరు పెట్టుకొంటే

    చౌదరీ అని పేరు పెట్టుకొంటే

    నేను ఫృథ్వీ చౌదరీ అంటే నాకు విపరీతంగా వేషాలు వచ్చేవి. అలా చౌదరీ అని పేరు పెట్టుకొన్న ప్రతిభలేని వారికి అవకాశాలు చాలా వచ్చాయి. నాది పవన్ కల్యాణ్‌ది ఒకటే సామాజిక వర్గం అయినప్పటికీ.. నాకు వైఎస్ జగన్ ఇష్టం. రాజకీయ నేతగా నేను ఆయనను ఇష్టపడుతాను. అందుకే వైసీపీలో చేరాను అని ఫృథ్వీ పేర్కొన్నారు. నాకు వచ్చిన పదవితో అందరికీ ఉద్యోగం కల్పిస్తున్నాను అని ఆయన అన్నారు.

    పవన్ కల్యాణ్‌ను తిడితే..

    పవన్ కల్యాణ్‌ను తిడితే..

    ఇక పవన్ కల్యాణ్ జనసేనను విమర్శించడం కేవలం సిద్దాంతపరమైన విభేదాలే. ఆయనతో వ్యక్తిగతం మంచి రిలేషన్స్ ఉన్నాయి. పవన్‌ను విమర్శిస్తే.. నన్ను ట్రోల్ చేసేవారి ఒకటి గుర్తుంచుకోవాలి. ఆయనను పావలా కల్యాణ్ అంటూ ఓ టీడీపీ నేత విమర్శిస్తే జనసైనికులు మాట్లాడలేదేంటి? సైరా ఫంక్షన్‌లో నా ఫోటో పెట్టి ట్రోల్ చేయడం చిల్లర వేషాలు. వాటిని చూసి నవ్వుకొన్నాను అని పృథ్వీ పేర్కొన్నారు.

    English summary
    Prudhvi Raj cast remarks in Tollywood and Pawan Kalyan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X