»   » బాస్ ఈజ్ బ్యాక్ అంటూ హోరెత్తిపోతోంది.... ఖైదీ నెం 150 పై అభిమానుల స్పందన

బాస్ ఈజ్ బ్యాక్ అంటూ హోరెత్తిపోతోంది.... ఖైదీ నెం 150 పై అభిమానుల స్పందన

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాస్ ఈజ్ బ్యాక్ అనే అరుపులూ, కేరింతలూ పదేళ్ళ తర్వాత అన్నయ్యని స్క్రీన్ మీద చూసుకున్న ఆనందం.... ఎట్టకేలకు మెగస్టార్ ముందు కాలం, మార్పులూ, కొత్త పోకడలూ, జనరేషన్ గ్యాప్ లూ ఏవీ పనికి రావని తేలిపోయాయ్..... సినిమా సూపర్ హిట్ అని తేలిపోయింది నటుడు శ్రీకాంత్, దర్శకుడు మారుతీ, మిగతా హీరోలూ...

అన్నయ్యని చూసి వాళ్ళ అభిప్రాయాలు చెప్పేటప్పుడు కూడా కేవలం చిరంజీవి ఫ్యాన్స్ గా కనిపించారు. రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు చిరు సినిమా విడుదలైన ప్రతీ థియేటర్ వద్దా అభిమానుల సందడితో వాతావరణం ఉల్లాసంగా కేరింతలతో హోరెత్తిపోతోంది. "పదేళ్ళ విరామం తర్వాత వచ్చినా తన స్టామినా ఏమిటో మళ్ళీ ఒక సారి నిరూపించుకున్నాడు అన్నయ్య" అంటూ.ప్రతీ అభిమానీ మీడియా కెమెరాల ముందు ఉత్సాహంతో ఊగిపోతున్నారు. మొత్తానికి నిన్నటి వరకూ ఉన్న ఒక ఉత్కంఠ కి తెరపడింది. ఏలా ఉండబోతోందో అన్న సినిమా తమ ఊహలకు మించి ఉందనీ ఇలా మళ్ళీ పెద్ద బ్లాక్ బస్టర్ తో మెగాస్టార్ మళ్ళీ అడుగు పెట్టటం తమకు పూర్తి సంతోషాన్నిచ్చింది అంటూ చెప్తూన్న అభిమానులకి ఇప్పుడప్పుడే ఈ ఆనందం పూర్తయ్యేలా లేదు. అన్నయ్యగా పిలుచుకునే చిరు తన సత్తా ఏమిటో మళ్ళీ ఒక సారి చూపించేసినట్టే.

English summary
chiranjeevi fans so happy with chiru's new Movi Khaidi no 150. fans became crazy about Chirus re entry performance
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu