»   » కబాలి, సుల్తాన్ సినిమాలని దాటేసింది, మామూలు రికార్డ్ కాదు

కబాలి, సుల్తాన్ సినిమాలని దాటేసింది, మామూలు రికార్డ్ కాదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

త్రివేండ్రమ్: ఇప్పుడు కేరళలలో ఎక్కడ విన్నా మోహన్ లాల్ నటించిన పులి మురగన్ గురించే మాట్లాడుకుంటున్నారు. యాక్షన్ ధ్రిల్లర్ గా రెడీ అయిన ఈ చిత్రం మోహన్ లాల్ కెరీర్ లో పెద్ద హిట్ చిత్రంగా నమోదు అయ్యింది. అంతేనా..కేరళలలో సల్మాన్ ఖాన్ సుల్తాన్, రజనీకాంత్ కబాలి కలెక్షన్స్ ని దాటి రికార్డ్ లు క్రియేట్ చేస్తూ షాక్ ఇస్తోంది. 630 షోలతో రిలీజైన ఈ చిత్రం మోహన్ లాల్ కెరీర్ లోనే బెస్ట్ రివ్యూలను అందుకుంది. ఈ చిత్రం ఎక్కువ కలెక్ట్ చేస్తోంది.

పులిమురగన్ చిత్రం ఏ విషయంలో రికార్డ్ బ్రద్దలుకొట్టిందనేగా మీ డౌట్. కబాలి చిత్రం 425 షోలతో రిలీజ్ అయితే, సల్మాన్ ఖాన్ సుల్తాన్ 225 షోలతో రిలీజైంది. కానీ పులిమురగన్ కేవలం అరబ్ కంట్రీస్ లోనే 486 షోలతో రిలీజై ఇఫ్పటికీ విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.

Pulimurugan Beats Kabali & Sultan Pulimurugan

'జనతా గ్యారేజ్' సినిమాతో తెలుగులోనూ సూఫర్‌హిట్ అందుకున్న మోహన్‌లాల్ దసరా కానుకగా 'పులి మురుగన్' చిత్రం త్వరలోనే తెలుగు నాట కూడా సందడి చేయనుంది. తెలుగులో 'మన్యం పులి' పేరిట శ్రీ సరస్వతి ఫిల్మ్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత సింధూరపువ్వు కృష్ణారెడ్డి విడుదల చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో 'పులి మురుగన్' చిత్రాన్ని సైతం కృష్ణారెడ్డి తెలుగునాట పెద్ద హిట్ చేస్తారని మలయాల వెర్షన్ నిర్మాత తోమిచమ్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. అలాగే 'మన్యంపులి'గా తెలుగునాట కూడా తిరుగులేని విజయం సాధిస్తుందని తెలుగు చిత్ర పరిశ్రమ భావిస్తోంది.

'పులి మురుగన్' మాంచి మసాలా సినిమా అనేది వాస్తవం. రెగ్యులర్ వెరీటీగా ,విభిన్నంగా సినిమాలు చేసే లాల్.. ఈ సినిమాలో రొటీన్ మాస్ మసాలా కథను చేసారు. ఈ సినిమా కలెక్షన్లు భాక్సాఫీస్ ని బ్రద్దలు కొడుతూ రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి కానీ.. సమీక్షకులు మాత్రం ఈ సినిమాపై విమర్శలు గుప్పించారు.

మా హీరో సినిమాకే నెగిటివ్ గా రివ్యూ రాస్తావా, నిన్ను చంపుతాం, బూతులు

జగపతిబాబు, కమలినీ ముఖర్జీ కీలకపాత్రల్లో నటించిన ఈ సినిమాకు దర్శకుడు:వైశాఖ, కథ:ఉదయకృష్ణ, సంగీతం:గోపీసుందర్, కెమెరా:షాజీకుమార్.

English summary
Pulimurugan, the action thriller has emerged as the biggest hit in Mohanlal's career. Now, Pulimurugan has also succeeded in outshining the biggest hits of recent past, Rajinikanth's Kabali and Salman Khan's Sultan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu