twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Puneeth Rajkumar: Jr NTR డిజాస్టర్ కథతో కన్నడలో హిట్టు కొట్టిన హీరో.. తెలుగు రీమేక్‌లు ఏన్నంటే?

    |

    కన్నడ చిత్ర పరిశ్రమలోకి రాజ్ కుమార్ రెండవ వారసుడిగా అడుగుపెట్టిన పునీత్ రాజ్ కుమార్ అతి తక్కువ కాలంలోనే మంచి నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నాడు. అయితే ఆ హీరో మరణవార్త అందరిని ఒక్కసారిగా కలచివేసింది. ఇక పునీత్ ఆరేళ్ళ వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా తన నటన జీవితాన్ని ప్రారంభించాడు. బుల్లితెరపై కూడా పలు రియాలిటీ షోతో ఆకట్టుకున్న ఈ హీరో సింగర్ గా కూడా మంచి క్రేజ్ అందుకున్నాడు.

    అయితే రాజ్ కుమార్ మొదట ఒక తెలుగు డైరెక్టర్ సినిమాతోనే వెండితెరకు పరిచయమయ్యాడు. అంతేకాకుండా తెలుగులో డిజాస్టర్ అయిన ఎన్టీఆర్ కథతో కన్నడలో బాక్సాఫీస్ హిట్ అందుకోవడం విశేషం. పునీత్ తెలుగు సినిమాలను కొన్నిటిని కన్నడలో రీమేక్ చేసి తన స్థాయిని మరింత పెంచుకున్నాడు.

    అభిమానులపై అపారమైన ప్రేమ

    అభిమానులపై అపారమైన ప్రేమ

    తెలుగు సినిమా ఇండస్ట్రీకి పునీత్ రాజ్ కుమార్ కు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది అని చెప్పవచ్చు. అతడు గతంలో ఎన్నో తెలుగు సినిమాలను కన్నడలో రీమేక్ చేశాడు. కేవలం ఒక మంచి నటుడిగానే కాకుండా మంచి హీరోగా కూడా పునీత్ అభిమానుల్లో చెరగని ముద్రవేసుకున్నాడు. పునీత్ ను కలవడానికి ఎలాంటి అభిమాని వచ్చినా కూడా వారి స్థాయిని పట్టించుకోకుండా కలిసి భోజనం చేసిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అందుకే పునీత్ అంటే అభిమానులు ఎంతగానో ఇష్టపడతారు.

    పూరి జగన్నాథ్ తో మొదటి సినిమా

    పూరి జగన్నాథ్ తో మొదటి సినిమా

    2002లో పునీత్ రాజ్ కుమార్ హీరోగా చేసిన మొదటి సినిమా 'అప్పు' బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమాను డైరెక్ట్ చేసింది మరెవరో కాదు. టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఇడియట్ కథను పూరి మొదట కన్నడ ఇండస్ట్రీలోనే తెరకెక్కించాడు. అక్కడ హిట్ అయిన తర్వాత మళ్లీ తెలుగులో రవితేజ తో రీమేక్ చేశాడు. తెలుగులో కూడా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

    ఆంధ్రవాలాతో సక్సెస్

    ఆంధ్రవాలాతో సక్సెస్

    అయితే ఎవరూ ఊహించని విధంగా పునీత్ రాజ్ కుమార్ తెలుగులో డిజాస్టర్ అయినటువంటి ఆంధ్రావాలా సినిమాతో కూడా సక్సెస్ అందుకున్నాడు. ఆ మూవీ కథను కన్నడలో వీర కన్నడిగా పేరుతో రీమేక్ చేసి మంచి సక్సెస్ అందుకొని అందరిని ఆశ్చర్యపరిచాడు. ఆ సినిమాను తెలుగు దర్శకుడు మెహర్ రమేష్ దర్శకత్వం వహించడం విశేషం. ఆంధ్రావాలా సినిమా కథ సక్సెస్ అవుతుంది అని ఎవరూ ఊహించలేదు.

    మహేష్ బాబు సినిమాతో..

    మహేష్ బాబు సినిమాతో..

    ఇక ఆంధ్రావాలా సినిమా రీమేక్ అనంతరం పునీత్ రాజ్ కుమార్ మరిన్ని తెలుగు సినిమాలను రీమేక్ చేయాలని ఆలోచించాడు. అందులో భాగంగా మహేష్ బాబు ఒక్కడు సినిమాను రీమేక్ చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు. మళ్లీ మూడేళ్ల తర్వాత రామ్ పోతినేని శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వచ్చిన రెడీ సినిమాను కూడా కన్నడలో రీమేక్ చేసి హిట్ కొట్టాడు.

    Recommended Video

    Hero Srikanth Released Poison Movie Song
    చివరగా వచ్చిన సినిమా..

    చివరగా వచ్చిన సినిమా..

    మహేష్ బాబు శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన దూకుడు సినిమాను కూడా 2014లో రీమేక్ చేసి కన్నడలో బాక్సాఫీస్ హిట్ అందుకున్నాడు. ఇలా మొత్తంగా పునీత్ రాజ్ కుమార్ టాలీవుడ్ బాక్సాఫీస్ సినిమాలతో కన్నడలో తన స్థాయిని పెంచుకుంటూ వచ్చాడు. ఇక తను చివరిగా నటించిన యువరత్న సినిమా కూడా తెలుగులో డబ్ చేసి భారీగానే విడుదల చేశారు. ఆ సినిమాకు సంబంధించిన తెలుగు ప్రమోషన్ లో కూడా పునీత్ పాల్గొన్నారు.

    English summary
    Puneeth Rajkumar tollywood remake movies in kannada industry..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X