»   » ఎన్టీఆర్ అండ, మళ్లీ అల్లు అర్జున్ తో తలపడుతున్నాడు

ఎన్టీఆర్ అండ, మళ్లీ అల్లు అర్జున్ తో తలపడుతున్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగుళూరు: మీకు గుర్తుందా గతంలోనూ అల్లు అర్జున్, పునీత్ రాజ్ కుమార్..భాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. పునీత్ ..రానా విక్రమ చిత్రం ..అల్లు అర్జున్ సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు రెండు ఒకే రోజు విడుదల అయ్యాయి.

దానికి తోడు సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కీ రోల్ వేయటంతో బెంగుళూరులోనూ భారీ ఓపినింగ్స్ తో రిలీజైంది. ఇప్పుడు మరోసారి అలాంటి ఫీటే రిపీట్ అవుతోంది. వాస్తవానికి అల్లు అర్జున్ కు కన్నడంలో డీసెంట్ మార్కెట్ ఉంది. దాంతో అక్కడ కూడా భారీ ఎత్తున సరైనోడు రిలీజ్ అవుతోంది.

ఇప్పుడు పునీత్ రాజ్ కుమార్ తాజా చిత్రం చక్రవ్యూహ 22 ఏప్రియల్ న రిలీజ్ చేస్తున్నారు. అదే రోజున అల్లు అర్జున్ కోసం బెంగుళూరు లో కొన్ని ధియోటర్స్ బ్లాక్ చేసారు. ఆయన సరైనోడు చిత్రం కూడా అక్కడ రిలీజ్ అవుతోంది.

Puneeth & Telugu Star Allu Arjun To Lock Horns At The Box Office, AGAIN!

చిన్న సినిమాలు అన్నీ తప్పుకున్నా సరైనోడు చిత్రం మాత్రం పోటా పోటీగా రిలీజ్ అవటం పునీత్ రాజ్ కుమార్ ఫ్యాన్స్ కు మింగుడు పటడం లేదు. అప్పటికీ పునీత్ చక్రవ్యూహ చిత్రంలో ఎన్టీఆర్ పాడిన పాట ఉండటంతో తెలుగు సినీ అబిమానులు సైతం సినిమా చూడాలని ఫిక్స్ అయ్యారు.

అయితే తెలుగు సినిమా అభిమానులకు సరైనోడు రావటంతో వారి దృష్టి అటు వైపు పడుతుంది. దాంతో ఖచ్చితంగా చక్రవ్యూహ కలెక్షన్స్ కొంత లో కొంత ఎఫెక్ట్ అవుతాయని భాక్సాఫీస్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

క్రితం సారి సన్నాఫ్ సత్యమూర్తి సమయంలో ఉపేంద్ర మ్యాజిక్ కొంతవరకూ కన్నడ భాక్సాఫీస్ వద్ద పనికొచ్చింది. మరి సరైనోడు అలాంటి కన్నడ ప్రేక్షకులను టార్గెట్ చేసే అంశాలు లేవు. ఈ సారి తమిళంలో పాపులారిటీ ఉన్న ఆది పినిశెట్టిని తీసుకుని తమిళ మార్కెట్ పై దృష్టి సారించారు అల్లు అర్జున్.

English summary
Puneeth's Rana Vikrama and Telugu actor Allu Arjun's Son Of Satyamurthy released on the same day. Apparently, he is again gearing up to lock horns with Powerstar Puneeth Rajkumar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu