»   »  బాలయ్య టపోరీ కాదు... కొత్త టైటిల్ ఇదే, ఫిక్స్ అయిపోయింది

బాలయ్య టపోరీ కాదు... కొత్త టైటిల్ ఇదే, ఫిక్స్ అయిపోయింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

కథ, సినిమా విషయం లో పూరీ కి ఒక అలవాటుంది... ముందుగా టైటిల్ ని ఆలోచిస్తాడు అది సరిగ్గా ఉందనిపిస్తే అప్పుడు కథ రాయటమో లేదంటే అందకు ముందున్న ఐడియా ని ఆ టైటిల్ కి ఆప్ట్ గా మార్చుకోవటమో చేస్తాడు. కానీ ఈ స్టైల్ కొన్నాళ్ళు గా వర్కౌట్ అవటం లేదు.

పద్దతుల్లో కొన్ని మార్చుకున్నాడు

పద్దతుల్లో కొన్ని మార్చుకున్నాడు

ఇడియట్, పోకిరీ లాంటి తిట్లని టైటిల్ గా వాడటం మొదట్లో కొత్తగా అనిపించినా, లోఫర్, రోగ్ లదగ్గరికి వచ్చేసరికి ఆ ఫార్ములా బోర్ కొట్టేసింది. ఇక హీరో బాడీలాంగ్వేజ్ కూడా ఇడియట్ కాలం నాటి హీరోకంటే టెంపర్ లో జూనియర్ దగ్గరికి వచ్చేసరికి కొంత మారింది. అదే పాత స్టైల్లో ట్రై చేసిన ఇజం దెబ్బేసింది. అందుకే ఈ మధ్య తన పద్దతుల్లో కొన్ని మార్చుకున్నాడు పూరీ...

టైటిల్ విషయంలో ఆచితూచి

టైటిల్ విషయంలో ఆచితూచి

తన ప్రతి సినిమాకి టైటిల్ ఫిక్స్ చేసి ఆ తర్వాత కథ రాసుకోవడం ఈ సారి చేయలేదు. బాలయ్య తో తీస్తున్న సినిమా టైటిల్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు పూరి. అందుకే బాలకృష్ణ సినిమా ప్రకటించి చాలా రోజులు అవుతున్నా...టైటిల్ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.

సార్వభౌముడు, టపోరి

సార్వభౌముడు, టపోరి

సార్వభౌముడు, టపోరి పేర్లును పరిశీలిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. తాజా వార్తల ప్రకారం 'ఉస్తాద్' టైటిల్ ని ఫిక్స్ చేయాలనుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.బాల‌య్య ఈసారి ఉస్తాద్‌గా క‌నిపించ‌డం ఖాయ‌మ‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు అంటున్నాయి. పూరి ఈ టైటిల్‌ని రిజిస్ట‌ర్ కూడా చేయించేశాడ‌ట‌.

గ్యాంగ్ స్ట‌ర్ క‌థ

గ్యాంగ్ స్ట‌ర్ క‌థ

బాల‌య్య‌కీ ఈ టైటిల్ బాగా న‌చ్చింద‌ని, దాదాపుగా ఇదే ఫిక్స‌యిపోవొచ్చ‌ని తెలుస్తోంది. ఇదో గ్యాంగ్ స్ట‌ర్ క‌థ అని పూరి హింటిచ్చేశాడు. ఓ హాలీవుడ్ సినిమా ఆధారంగా క‌థ త‌యారు చేసుకొన్నార‌ని ఫిల్మ్‌న‌గ‌ర్‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఆ క‌థే... పూరి టేక‌ప్ చేస్తే దానికి ఉస్తాద్ అనే టైటిల్ నూటికి నూరు శాతం ప‌క్కాగా కుదిరిపోతుందంటున్నాయి ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు.

పూరీ మార్క్ హీరో

పూరీ మార్క్ హీరో

'ఉస్తాద్' టైటిల్ పట్ల నందమూరి అభిమానులు కూడా పాజిటివ్ గా స్పందిస్తున్నారు. టైటిల్ చాలా పవర్ ఫుల్ గా ఉంది. పూరీ మార్క్ హీరోగా బాలకృష్ణను చూడటానికి ఆయన అభిమానులంతా ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ సినిమా తరువాత కె. ఎస్. రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ తన 102వ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకి 'రెడ్డిగారు' అనే టైటిల్ ను ఖరారు చేసే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నారట.

English summary
As per latest buzz, sensational director Puri Jagannath next with Balayya titled as ‘Ustad’
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu