»   » 'అత్తారింటికి దారేది' కి అలాగే జరిగింది : పూరీ జగన్నాథ్

'అత్తారింటికి దారేది' కి అలాగే జరిగింది : పూరీ జగన్నాథ్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Puri Jagannath
హైదరాబాద్ : ప్రతి సినిమాకూ డివైడ్ టాక్ ఉంటుంది కదా. అయినా ఏ సినిమాకు డివైడ్ టాక్ రాలేదో చెప్పండి? మొన్న బ్లాక్ బ్లస్టర్ హిట్ అయినా 'అత్తారింటికి దారేది' సినిమాకు కూడా డివైడ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే కదా. 'హార్ట్ ఎటాక్'కు మంచి రిపోర్టులు వచ్చాయి. మేమంతా హ్యాపీ అంటూ చెప్పుకొచ్చారు పూరి జగన్నాథ్. ఆయన తాజా చిత్రం 'హార్ట్ ఎటాక్' మొన్న శుక్రవారం విడుదలైంది. అయితే డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపధ్యంలో ఆయన ఇలా స్పందించారు.

అలాగే...సినిమా బాగుందని చాలా మంది చెబుతున్నారు కానీ కొందరు బాగాలేదు అంటున్నారు. 'అత్తారింటికి దారేది' సినిమా ఇంత బాగా ఆడినా... మంచి వసూళ్లు సాధించినా ఇప్పటికీ కొందరు సినిమాలో ఏముందిలే అని పెదవి విరుస్తున్నారు. మా సినిమా కూడా అంతే. 'తొలిరోజు నైజాం ఏరియాలో ఒక కోటి తొమ్మిది లక్షల షేర్ వసూలు చేసి నితిన్ సినిమాల్లో రికార్డ్ నెలకొల్పింది. మిగతా ఏరియాల్లోనూ కలెక్షన్లు చాలా బాగున్నాయ'ని చెప్పారు.

'హార్ట్ ఎటాక్' మూవీకి అన్ని చోట్ల నుంచి గుడ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. చాలా చోట్ల నుంచి బయ్యర్స్ ఫోన్ చెప్తున్నారు. జనరల్‌గా అయితే నేనే ఫోన్ చేసి కనుక్కుంటాను కానీ, ఈ సినిమాకు మాత్రం వాళ్లే నాకు కాల్ చేసి రిపోర్ట్స్ చెబుతున్నారు. చాలా హ్యాపీగా ఉంది. నేను, నితిన్ శాంతి థియేటర్‌లో సినిమా చూశాం. ప్రేక్షకుల స్పందన చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యాం. నితిన్ అయితే కన్నీళ్లు పెట్టుకన్నాడు. అది చూసి నాకూ ఏడుపొచ్చింది.


'హార్ట్‌ఎటాక్‌' ముద్దు నేపథ్యంలోనే నడుస్తుంది. సెన్సార్‌ సమస్యల వల్ల ముసుగు కప్పాల్సి వచ్చింది. ఆ నిబంధనల్లో కిడ్నాప్‌, మర్డర్లు లాంటివి సినిమాల్లో ఉండకూడదు అని ఉంది. అయితే అవి చేయకపోతే విలన్‌ ఎందుకు? సెన్సార్‌ మార్గదర్శకాలు చదివితే సినిమాలు చేయలేం అన్నారు. తర్వాత సినిమా మహేష్‌తోనే. మహేష్‌ని మాత్రం కొత్తగా చూపిస్తాం. బాలీవుడ్‌లో రెండు సినిమాలు సైన్‌ చేశాను. 'సన్నాఫ్‌ సర్దార్‌' నిర్మాత ఎన్‌ఆర్‌ పచీసియా ఈ సినిమాలు నిర్మిస్తారు. నా సినిమా వచ్చింది అంటే 'పోకిరి'లా ఉందా అని చూస్తున్నారు. అన్నీ అలా ఉండాలి అంటే కుదరదు కదా? అన్నారు.

English summary
Heart Attack directed by Puri Jagannath is released with divide talk. This is the first film in this combination and the leading lady of the film is Aada Sharma. Music is scored by Anup. Ali and Brahmanandam also starred in the film. Heart Attack is the first movie coming from Puri Touring Talkies.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu