‘పండగ చేస్కో’ డైలాగు గురించి పూరి జగన్నాథ్
హైదరాబాద్ మహేష్ బాబు 'పోకిరి' సినిమాలోని 'పండగ చేస్కో' డైలాగ్ వినని వాళ్లు ఉండరు. ఆ సినిమా చూడనివాళ్లు కూడా ఆ డైలాగుని వినే ఉంటారు. అంతగా ఆ డైలాగు ఆ పాపులర్ అయ్యింది. మరి ఆ డైలాగు రాయటానికి పూరి జగన్నాథ్ వెనక ఉన్న కథ ఏమిటీ అన్నది ఆయన ఓ లీడింగ్ డైలీ కు వివరించారు. అదేమింటంటే...
పూరి జగన్నాథ్ మాట్లాడుతూ...''ఇది ఆ పాత్రకు అనుగుణంగా ఓ ఫ్లోలో రాసిన డైలాగ్. ఇంత క్లిక్ అవుతుందని నేనే ఊహించలేదు. నా కళ్ల ముందే చాలా మంది ఈ డైలాగ్‌ని విరివిగా వాడడం చూసి ఆశ్చర్యపోయాను. ఒక్కోసారి అంతే. ప్రేక్షకులకు కనెక్టయితే ఆ డైలాగ్ అలా వాళ్ల మనుగడలో కలిసిపోతుంది. ఇదీ అంతే'' అన్నారు.
ఇక చిత్రంలో ఈ డైలాగు ...ఎక్కడ వస్తుందంటే...లోకల్ ట్రెయిన్ కోసం ఎదురు చూస్తున్న బ్రహ్మానందం దగ్గరకు అలీ వచ్చి ముష్టి అడుగుతాడు. బ్రహ్మానందం స్టయిల్‌గా ఓ రూపాయి తీసి ''పండగ చేస్కో'' అంటాడు.
అలీ ఆ రూపాయినొకసారి చూసి ''దీంతో ఏ పండగ చేస్కోవాలి? క్రిస్‌మస్సా? సంక్రాంతా?'' అని చిరాకుపడతాడు. అప్పటి నుంచీ 'పండగ చేస్కో' డైలాగ్ జనంలో కలిసిపోయింది. ఆ మధ్యన ఈ డైలాగుని ఓ దర్శకుడు టైటిల్ గా కూడా రిజిస్టర్ చేసారు.


Click it and Unblock the Notifications












