»   » అదే విషయం చిరంజీవి నాకే చెప్తే చేసేవాడ్ని : పూరి జగన్నాధ్

అదే విషయం చిరంజీవి నాకే చెప్తే చేసేవాడ్ని : పూరి జగన్నాధ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :నేను చిరంజీవికి కథ చెప్పాను, కానీ ఆయనకు నచ్చలేదు. దీంతో అనిశ్చితి కొనసాగుతోంది. ఆ సినిమా చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధమే. మొదట కథ చెప్పాక... సగం నచ్చిందని చెప్పారు. మళ్లీ రెండో సగం చెప్పాక, 'నేను మళ్లీ కబురు పెడతా' అన్నారు. ఇంతలో రెండో సగ భాగం కథ నచ్చలేదని ఆయన మీడియాతో చెప్పారు.

chiru puri

ఒకవేళ అదే విషయం నాకు చెప్పుంటే కథలో ఏం నచ్చలేదో తెలుసుకొని మార్పులు చేసేవాణ్ని అంటూ పూరి జగన్నాథ్ చెప్పుకొచ్చారు. సోమవారం పూరి జగన్నాథ్‌ జన్మదినం. ఈ సందర్భంగా ఆయన ఆదివారం హైదరాబాద్‌లో మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్బంగా చిరంజీవి 150వ సినిమాని మీరు చేస్తున్నట్టేనా? అని అడిగిన ప్రశ్నకు ఆయన ఇలా సమాధానమిచ్చారు.


గతంలో...

"నాకు పూరి జగన్నాథ్ నేరేట్ చేసిన కథ సెకండాఫ్ నచ్చలేదు ," అంటూ చిరంజీవి తన 150 వ చిత్రం గురించి చాలా కాలం తర్వాత నోరు విప్పారు. ఆయన తెలుగులో ఓ లీడింగ్ టీవి ఛానెల్ తో మాట్లాడుతూ ఇలా స్పందించారు. ఓ మూడు నెలల లోపు స్క్రిప్టుని ఫైనలైజ్ చేసి పట్టాలు ఎక్కిస్తామనే ధీమాగా ఆయన చెప్పుకొచ్చారు. చిరంజీవి, పూరి కాంబినేషన్ లో ఆటో జాని చిత్రం వస్తుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చిరంజీవి ఇలా చెప్పి దానికి అడ్డుకట్ట వేసారు.

puri

వివి వినాయిక్ తోనే చిరంజీవి ముందుకు వెళ్తాడని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు నిమిత్తం ఇండస్ట్రీలోని టాప్ రైటర్స్ చేత కథలు సిద్దం చేస్తున్నట్లు వార్త. వాటిలో ఒకటి ఫైనలైజ్ చేస్తారని అంటున్నారు.

అందుతున్న సమాచారాన్ని బట్టి చిరంజీవి తన 150వ మెసేజ్ ఓరియెంటెడ్ లాగ కాకుండా ఓ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా చూడాలనకుంటున్నారని, అది లాండ్ మార్క్ గా నిలిచిపోయేలే చేయాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.

చిరంజీవి అంచనాల మేరకు ఏ స్క్రిప్టు ఓకే కాకపోవటంతో ప్రాజెక్టు డిలే అవుతూ వస్తోంది. ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మిస్తారు...చిరంజీవి గారి సతీమణి సురేఖ సమర్పిస్తారు. మరో ప్రక్క చిరంజీవి ఈలోగా రామ్ చరణ్ తాజా చిత్రం బ్రూస్ లీ లో గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు.

English summary
Director Puri Jagannath said that if Chiranjeevi told to him about 150th movie story, he will do that.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu