»   » వయసు పెరిగే కొద్దీ తగ్గుతోంది: పూరీ జగన్

వయసు పెరిగే కొద్దీ తగ్గుతోంది: పూరీ జగన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రతీసారీ కొత్త కొత్త ఆలోచనలతో చేయటం సాధ్యం కాదు. వయసు పెరిగే కొద్దీ ఆలోచనా శక్తి కూడా తగ్గుతుంది అంటున్నారు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్. ఆయన తాజా చిత్రం బుడ్డా విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న సందర్భంగా కలిసిన మీడియాతో ఆయన ఇలా స్పందించారు. అలాగే బాలీవుడ్‌ కి రావటమంటే...దర్శకుడిగా మరో మెట్టు ఎక్కినట్టే. అవకాశమొచ్చినప్పుడు వదులుకోకూడదు. సినిమా అంటే...ఆలోచనలు అమ్ముకోవటమే. అది టాలీవుడ్‌లోనా...హాలీవుడ్‌లోనా ... అన్నది ముఖ్యమైన విషయం కాదు.ఇక ఈ సినిమా వల్ల చార్మి, సబ్బరాజూ...బాలీవుడ్‌కు పరిచయమయ్యారు. షాయాజీ షిండే లాంటి వాళ్లు వచ్చీరానీ హిందీలో మాట్లాడుతుంటే మనకి సరదా అనిపించింది. ఇప్పుడు సుబ్బరాజుని చూస్తే హిందీ వాళ్లకు కొత్తగా అనిపిస్తుంది. 'సుబ్బరాజంట...ఎవరో బాగా చేశాడు. మీ సినిమాల్లో తీసుకోవచ్చుకదా..' అని వర్మ దగ్గరకు వెళ్లి చెబుతున్నారంట అని నవ్వుతూ చెప్పుకొచ్చారు పూరీ జగన్నాధ్.

English summary
Buddha failed to attract as many. Delhi Belly has fabulous start at boxoffice when the film released at 1200 screens and saw the occupancy of 70 to 90 percent.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu